ఆ రోడ్డుకు మోక్షమెన్నడో..?
ABN , First Publish Date - 2021-10-29T05:48:07+05:30 IST
నగరంలోని రామ్‌న గర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి( ఆర్‌ఓబీ)నిర్మాణం పూర్తయి మూడేళ్లయింది. కానీ బ్రిడ్జి కింది భాగంలో ఉన్న సర్వీసు రోడ్డు పరిస్థితి ఇప్పటికీ అధ్వా నంగా ఉంది.
- రామ్‌నగర్ ఫ్లైఓవర్ కింద అధ్వానం
- కాలువ కోసం తవ్వి వదిలేసిన వైనం
- ఇబ్బందులు పడుతున్న స్థానికులు
అనంతపురం కార్పొరేషన, అక్టోబరు28 : నగరంలోని రామ్‌న గర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి( ఆర్‌ఓబీ)నిర్మాణం పూర్తయి మూడేళ్లయింది. కానీ బ్రిడ్జి కింది భాగంలో ఉన్న సర్వీసు రోడ్డు పరిస్థితి ఇప్పటికీ అధ్వా నంగా ఉంది. ఈ మూడేళ్లలో ఏ ఒక్క నాడు అధికారులు ఆ వైపు తొం గిచూడ లేదు. వాస్తవానికి రోడ్లు, భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) అధికా రులు సర్వీసు రోడ్డు పని, పక్కనే మురుగుకాలువ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు చా లా ఇబ్బందులు పడుతు న్నారన్నారు. బ్రిడ్జితో పాటు సర్వీసురోడ్డు, డ్రైనేజీ పను లు పూర్తిచేయాల్సి ఉంది. అందులోనూ అప్పట్లో ని ధులు సమకూరాయి. కానీ కాంట్రాక్టర్ మాత్రం అప్పట్లో పని పూర్తిచేయలేక పోయా డు. తాజాగా నూతన డ్రె యిన కోసం పాత కాలువ లను విస్తరించేందుకు మళ్లీ తవ్వారు. కానీ ఇప్పటికీ ఆ కాలువ నిర్మిం చలేకపోదు. దీంతో పెద్దగా తవ్విన ఆ కాలువగుంతలోకి మురుగునీరు చేరడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అక్కడ పదుల సంఖ్యలో దుకాణా లున్నాయి. దుకాణాలకు వెళ్లేవా రితో పాటు ఆ దుకాణాల యజమాను లు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మురునీరు రోడ్డుపైనే చే రుతోంది. దీంతో స్థానికులు ఆ మురుగునీటిపైనే నడిచి వెళ్లాల్సి వస్తోంది. ఈ విషయంలో నగరపాలక సంస్థ అధికారులు సమన్వయం చేసుకోకుండా పనిచేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం నిధులు లేకపోవడంతోనే ఆర్‌అండ్‌బీ పరిధిలోని ఆ పని పూర్తిచే యలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలుస్తోంది. మరి ఆ రోడ్డు, డ్రెయినకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో..? వేచి చూడాల్సిందే.