వడ్డీ మోసం

ABN , First Publish Date - 2021-12-15T06:00:14+05:30 IST

పట్టణంలోని నల్లగుట్ట వీధిలో ఉం టున్న అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపాల్‌ పద్మశ్రీ మరో మహిళ షమీమ్‌ తమను మోసం చేశారంటూ కదిరికి చెందిన సుజాత సోమవారం పట్టణ పోలీసుస్టేషనలో ఫిర్యా దు చేసినట్లు సీఐ సత్యబాబు తెలిపారు.

వడ్డీ మోసం

రూ. 10 కోట్ల వరకు కుచ్చుటోపీ

కదిరి, డిసెంబరు 14: పట్టణంలోని నల్లగుట్ట వీధిలో ఉం టున్న అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపాల్‌ పద్మశ్రీ మరో మహిళ షమీమ్‌ తమను మోసం చేశారంటూ కదిరికి చెందిన సుజాత సోమవారం పట్టణ పోలీసుస్టేషనలో ఫిర్యా దు చేసినట్లు సీఐ సత్యబాబు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు... పద్మశ్రీ తన తమ్ముడు కంపెనీ అయిన సిగ్మాసిక్స్‌లో పెట్టుబడులు పెడితే 30 శాతం వడ్డీ అధికంగా ఇస్తామని ఆశ చూపింది. కదిరికి చెందిన షమీమ్‌ ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి పద్మశ్రీకి డబ్బు ఇచ్చింది. 2020 మార్చి నుంచి 2021 జనవరి వరకు వీరిద్దరి మధ్య లావాదేవీలు సా గాయి. షమీమ్‌ తనకు వస్తున్న అధిక వడ్డీ గురించి ఇతరులకు చెప్పింది. వారు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపి షమీమ్‌కు డబ్బు ఇచ్చారు. షమీమ్‌.. పద్మశ్రీ అకౌంట్‌లో డబ్బు జమచేసింది. పద్మశ్రీ ఇచ్చిన రూ.30 శాతం లో 20 శాతం తాను పెట్టుకునీ, తన వద్ద పెట్టుబడి పెట్టిన వారందరికీ 10 శాతం వడ్డీ డబ్బు ఇచ్చింది. 2021 ఫిబ్రవరి నుంచి షమీమ్‌కు పద్మశ్రీ డబ్బు ఇవ్వలేదు. దీంతో షమీమ్‌ కూడా ఇతరులకు ఇవ్వలేదు. అనుమానం వచ్చి పెట్టుబడి పెట్టిన వారందరూ షమీమ్‌ను  నిలదీశారు. షమీమ్‌.. పద్మశ్రీని నిలదీసింది. డబ్బు ఇవ్వకపోవడంతో సుజాత అనే బాధితురాలు పద్మశ్రీతోపాటు మరో నలుగురిపై ఫిర్యాదు చే సింది. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చే స్తున్నట్లు సీఐ తెలిపారు. షమీమ్‌ కాకుండా నేరుగా పద్మశ్రీకే డబ్బులు ఇచ్చినవారు చాలామంది ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసుల లెక్క ప్రకారం రూ.7 కోట్ల వరకు ఉంటుందని అం చనా. ఇదే కాకుండా మరో రూ.3 కోట్ల వరకు ఉంటుందని బా ధితులు చెబుతున్నారు. పూర్తి విషయాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.


పద్మశ్రీ ఇంటి ఎదుట బాధితుల ఆందోళన

వైస్‌ ప్రిన్సిపాల్‌ పద్మశ్రీ తమకు డబ్బు వెంటనే ఇవ్వాలని బాధితులు మంగళవారం కదిరిలోని ఆమె ఇంటి ఎదుట ఆం దోళన చేశారు. తాము కుటుంబికులకు కూడా తెలియకుండా నగలు అమ్మి పెట్టుబడులు పెట్టామనీ, డబ్బు ఇవ్వకపోతే ఆత్మహత్య తప్పా.. మరోమార్గం లేదని బాధితులు చెప్పారు. డబ్బులన్నీ పద్మశ్రీ ఇతర స్థిరాస్థులపై పెట్టిందనీ, తన వద్ద ఏమీలేవని చెప్పడంతో తాము దిక్కుతోచని స్థితిలో పడ్డామని బాధితులు వాపోయారు.


Updated Date - 2021-12-15T06:00:14+05:30 IST