దేవాలయాలలో సీసీ కెమెరాలు అమర్చుకోండి : సీఐ

ABN , First Publish Date - 2021-07-24T06:26:53+05:30 IST

దేవాలయాలు, మసీదులు, తదితర ప్రార్థనా మందిరాలలో ఎ లాంటి ఘటనలకు తావులేకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకో వాలని నాలుగో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు అదేశించారు.

దేవాలయాలలో సీసీ కెమెరాలు అమర్చుకోండి : సీఐ
మాట్లాడుతున్న సీఐ కత్తి శ్రీనివాసులు

అనంతపురం క్రైం, జూలై 23 : దేవాలయాలు, మసీదులు, తదితర ప్రార్థనా మందిరాలలో ఎ లాంటి ఘటనలకు తావులేకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకో వాలని నాలుగో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు అదేశించారు. ఆయన తమ స్టేషన పరిధిలోని పలు దేవాలయాలు, మసీదులు, చర్చిల కమిటీ సభ్యులు, నిర్వాహకులు తదితరులతో ఆయా ప్రాంతాల వారీగా శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి చోరీలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పోలీసు సిబ్బంది కూడా నిఘా ఉంచుతుందన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాల న్నారు. నిర్వాహకులు, కమిటీ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు నిత్యం గమనిస్తూ ఉండాలని సూ చించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ జమాల్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-24T06:26:53+05:30 IST