ఐసీడీఎస్ అవకతవకలపై విచారణ
ABN , First Publish Date - 2021-01-20T06:08:47+05:30 IST
స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో మంగళవారం డిప్యూటీ కలెక్టర్ నిశాంతరెడ్డి విచారణ చేపట్టారు.

కణేకల్లు, జనవరి 19: స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో మంగళవారం డిప్యూటీ కలెక్టర్ నిశాంతరెడ్డి విచారణ చేపట్టారు. జిల్లావ్యాప్తంగా గతంలో ఐసీడీఎస్ ప్రాజెక్టులకు సరఫరా చేసిన సరుకుల రవాణాలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన స్థానిక కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోని తాడిపత్రి, అనంతపురంలో విచారణ చేపట్టామన్నారు. కణేకల్లు ప్రాజెక్టులో రికార్డులన్నీ సక్రమంగా వున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మీ, సీడీపీవో యల్లమ్మ పాల్గొన్నారు.
ప్రీ స్కూళ్లతో అంగనవాడీల్లో పెనుమార్పులు: పీడీ
రాష్ట్ర ప్రభుత్వం అంగనవాడీ కేంద్రాల్లో ప్రవేశపెట్టనున్న ప్రీప్రైమరీ విద్యతో పెనుమార్పులు రాబోతున్నట్లు ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మీ పేర్కొన్నారు. మంగళవారం ఆమె కణేకల్లుకు వచ్చిన సందర్భంగా స్థానికంగా నిర్వహిస్తున్న అంగనవాడీల శిక్షణ తరగతులను పరిశీలించారు. అంగనవాడీల్లో ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీషు బోధన ప్రవేశపెట్టి చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.