జీడిపల్లి రిజర్వాయర్‌కు 950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ABN , First Publish Date - 2021-08-15T06:33:42+05:30 IST
: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో నీరు చేరింది. దీంతో 1.681 టీఎంసీల నీటి సామర్థ్యం మించి శనివారం మరువ పారింది.
బెళుగుప్ప, ఆగస్టు 14: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో నీరు చేరింది. దీంతో 1.681 టీఎంసీల నీటి సామర్థ్యం మించి శనివారం మరువ పారింది. ప్ర స్తుతం రిజర్వాయర్‌కు 950 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, హంద్రీనీవా ఫేస్-2కు 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు నీటిపాదరుల శాఖ అధికారులు తెలిపారు.