లాసెట్‌లో మెరిసిన అనంత విద్యార్థులు
ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST
న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ లాసెట్ ఫలితాల్లో అనంత విద్యార్థులు మెరిశారు.

రాష్ట్రస్థాయిలో 3, 5, 7 ర్యాంకులు కైవసం
అనంతపురం అర్బన, అక్టోబరు 21: న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ లాసెట్ ఫలితాల్లో అనంత విద్యార్థులు మెరిశారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మూడు, ఐదు సంవత్సరాల కోర్సులు, పీజీ ప్రవేశాలకు ఏపీలాసెట్ నిర్వహించారు. ఫలితాలను గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన హేమచంద్రారెడ్డి, వీసీ జమున, ఏపీ లాసెట్ కన్వీనర్ చంద్రకళ విడుదల చేశారు. మూడేళ్ల కోర్సు ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో రాష్ట్రస్థాయి 10లోపు ర్యాంకుల్లో జిల్లాకు చెందిన ము గ్గురు విద్యార్థులు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. అనంత ఖ్యాతిని చాటా రు. వీరిలో నగరానికి చెందిన హరికృష్ణ 3వ ర్యాం కు, ఓబుళదేవరచెరువు మండలం నల్లగుండ్లపల్లికి చెందిన మంజునాథ 5, బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన హనుమంతరెడ్డి 7వ ర్యాంకు సాధించారు.
సివిల్స్ సాధిస్తా
లాసెట్ పూర్తిచేసి, సివిల్స్ సాధిస్తా. అందుకు ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నా. న్యాయ విద్య ను అభ్యసించడం ద్వారా సివిల్స్‌లో మంచి మా ర్కులు సాధించవచ్చన్న ఆలోచనతో లాసెట్ రాశా. అమ్మ జయలక్ష్మి గృహిణి, నాన్న శ్రీనివాసులు వ్యాపారం చేస్తారు.
- హరికృష్ణ, లాసెట్ 3వ ర్యాంకర్, అనంతపురం
పేదలకు సేవ నా ధ్యేయం
- మంజునాఽథ్, లాసెట్ రాష్ట్రస్థాయి 5వ ర్యాంకర్, నల్లగుండ్లపల్లి, ఓడి చెరువు మండలం
న్యాయ విద్యను అభ్యసించి, పేదలకు సేవ చే యాలన్నదే నా ధ్యేయం. సమాజంలోని సమస్య లు, పోలీసు స్టేషన్లలో పరిస్థితులను కళ్లారా చూ స్తు న్నాం. అత్యధికంగా పేదలకు న్యాయం జరగడంలేదు. చదువుకున్న వారే అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే.. నిరక్షరాస్యుల కష్టాలు చెప్పనవసరం లేదు. లాసెట్‌లో రాష్ట్రస్థాయి 5వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. అమ్మ పెద్ద లక్ష్మమ్మ, నాన్న చిన్న వీరప్ప. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న మృతితో అమ్మకు తోడుగా ఉంటూ చదువుకుంటున్నా.
