పని దినాలను పెంచండి
ABN , First Publish Date - 2021-10-29T05:39:12+05:30 IST
ప్రస్తుతం 90రోజులు పనిదినాలు కల్పిస్తు న్నారని, మరో 50రోజులు పెంచాలని కూలీలు కేంద్రబృందానికి విన్నవించుకున్నారు.

-కేంద్ర బృందంకు కూలీల విన్నపం
ముదిగుబ్బ, అక్టోబరు 28: కరువుప్రాంతం...ఉపాధిలేక తీవ్ర ఇబ్బందులు పడు తున్నాం.. ఉపాధిహామీ పథకం ద్వారా ప్రస్తుతం 90రోజులు పనిదినాలు కల్పిస్తు న్నారని, మరో 50రోజులు పెంచాలని కూలీలు కేంద్రబృందానికి విన్నవించుకున్నారు. గురువారం మండలంలోని దొరిగిల్లు, జొన్నలకొత్తపల్లి గ్రామాలలో కేంద్ర బృంద పర్యటించారు. ఉపాధి హామీ పథకం కింద నాటిన మామిడిమొక్కలు, దొరిగిల్లు, అడవిబ్రాహ్మణపల్లితండా సమీపంలో చేపట్టిన ఖండిత కందకాలు పనులను మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ అమరేంద్రప్రతాప్‌సింగ్, మినిస్ట్రీ ఆఫ్‌రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కిరణ్‌పడియాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం రైతులతో మాట్లాడుతూ...మామిడిమొక్కల పెంపకానికి తదితర పనులకు గాను ఎంత డబ్బుఇచ్చారు.. ఎంత దిగుబడి వచ్చింది, దినసరి కూలీ ఎంత ఇస్తున్నారు అంటూ కేంద్రబృందం ఆరాతీసింది. అనంతరం నాగలక్ష్మీ అనే ఉపాధి కూలీతో మాట్లాడుతూ.. మీరు చేసిన పనులకు సంబంధించి బిల్లులు సక్రమంగా వస్తున్నాయా అని అడిగితెలుసు కున్నారు. దీంతో మరో కూలి తమకు 90 రోజులతో పాటు మరో 50 రోజులు పనిది నాలుపెంచాలని అని విన్నవించడంతో ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ జాయింట్ కమిషనర్‌లు రా శివప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ సిరి, రాష్ట్ర పంచాయతీ రాజ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ చిన్నతాతయ్య,, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, సూపరిం టెండెంట్ శైలజ, ఎంపీడీఓ విజయలక్ష్మీ, ఉపాధిహామీ అధికారులు పాల్గొన్నారు.