పీఎంసీ ఎన్నికలపై పొంతనలేని లెక్కలు..!

ABN , First Publish Date - 2021-10-07T06:51:44+05:30 IST

జిల్లా వ్యాప్తంగా బుధవారం పాఠశాలల్లో నిర్వహించిన తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీ (పీఎంసీ) ఎన్నికలపై అధికారులు పొంతనలేని లెక్కలు చెబుతున్నారు.

పీఎంసీ ఎన్నికలపై పొంతనలేని లెక్కలు..!

85 కాదట.. 74 స్కూళ్లలోనేనట..

కమ్మూరు పాఠశాలలో ఎన్నికలు వాయిదా

అనంతపురం విద్య, అక్టోబరు 6: జిల్లా వ్యాప్తంగా బుధవారం పాఠశాలల్లో నిర్వహించిన తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీ (పీఎంసీ) ఎన్నికలపై అధికారులు పొంతనలేని లెక్కలు చెబుతున్నారు. ఇది విమర్శలకు తావిస్తోంది. గతనెల 22న జిల్లాలో పీఎంసీ ఎన్నికలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఘర్షణలు, మరికొన్ని చోట్ల కోరం లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ పాఠశాలల్లో తాజాగా పీఎంసీ ఎన్నికలు నిర్వహించారు. కూడేరు మండలంలోని కమ్మూరు జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో మరోసారి ఎన్నికలు వాయిదా పడ్డాయి. కోరం లేకున్నా.. వైసీపీ మద్దతుదారులు చైర్మన్‌ను ఏకపక్షంగా చేసుకుంటున్నారంటూ టీడీడీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో ఆ స్కూల్‌లో ఎన్నికలు వాయిదా వేశారు.

వింతలెక్కలు..

జిల్లాలో 74 స్కూళ్లలో ఎన్నికలు నిర్వహించామని సమగ్రశిక్ష అధికారులు చెబుతున్నారు. వారు చెబుతున్న లెక్కలకు పొంతన కుదరడం లేదు. గతనెల 22న 85 స్కూళ్లలో వా యిదా వేశామని అధికారులే ప్రకటించారు. తాజాగా ఎన్నికలు ఆ 85 స్కూళ్లలోనూ జరగాల్సి ఉంది. కానీ 74 పాఠశాలల్లోనే జరిగాయని చెబుతుండటం విమర్శలకు తావిస్తోం ది. వింత లెక్కలు... పొంతన లేని సమాధానాలు అధికారులు చెబుతుండటం విమర్శలకు తావిస్తోంది.


కదిరిపల్లిలో అదే అక్రమం

టీడీపీ సానుభూతిపరుడు గెలిచినా ఫలితం వెల్లడించని హెచఎం

నిలదీసిన టీడీపీ నాయకులు

గుంతకల్లు, అక్టోబరు6: పాఠశాల కమిటీ ఎన్నికల్లో నూ వైసీపీ దౌర్జన్యం కొనసాగింది. మండలంలోని కదిరిపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల కమిటీ ఎన్నికలో టీడీపీ సానుభూతిపరుడు బీ సుధాకర్‌ గెలిచినా వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన హెచఎం ఫలితాన్ని వెల్లడించకుండా పలాయనం చిత్తగించిన వైనం బుధవారం జరిగింది. పాఠశాల పాలక కమిటీ అధ్యక్ష స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో 35 ఓట్లకుగానూ 15 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 9 టీడీపీ సానుభూతి పరుడికి, 6 వైసీపీ సానుభూతిపరుడు మధుకు లభించాయి. ఇక ఫలితం వెల్లడి కావడమే త రవాయి అనుకున్న సమయంలో వైసీపీ నా యకులు పాఠశాల హెచఎం మౌలాలి నాయక్‌పై ఒత్తిడి తేవడంతో ఫలితాలు ఎంఈఓ వె ల్లడిస్తారంటూ గ్రామం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు. వెంబడించిన టీడీపీ నాయకులు గ్రామ శివారులో హెచఎం, సిబ్బందిని అడ్డగించి పాఠశాల కమిటీ ఫలితాన్ని వెల్లడించాలని నిలదీశారు. ‘మా పరిస్థితి మీకు తెలుసు. ఫలితాలను పై అధికారులకు పంపాను. వారు వెల్లడిస్తారు’ అని తెలిపిన హెచఎం పోలీసుల సాయంతో గ్రామం నుంచి బైటపడ్డారు. ఈ విషయంగా మాజీ ఎమ్మె ల్యే జితేంద్రగౌడు ఎంఈఓతో మాట్లాడాలని యత్నించగా ఆ యన ఫోన స్విచ ఆఫ్‌ చేయడంతో, హెచఎంకు కాల్‌ చేశారు. కానీ హెచఎం ఫోన తీయలేదని తెలిపారు. పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో సైతం వైసీపీ నాయకులు దౌర్జన్యంగా పదవులను పొందాలనుకోవడం ఆ పార్టీ విధానాన్ని తెలియజేస్తోందని పలువురు మండిపడ్డారు.  సంఘటనా స్థలంలో పోలీసులున్నా వైసీపీ నాయకులకే కొమ్ముకాయడం వారి చేతగానితనాన్ని చాటుతోందని విమర్శించారు. 

Updated Date - 2021-10-07T06:51:44+05:30 IST