దేవుని మాన్యంలో అక్రమ తవ్వకాలు

ABN , First Publish Date - 2021-05-18T06:06:57+05:30 IST

దేవుని మాన్యానికి రక్షణ కరువైంది. దేవాలయానికి సంబంధించిన 18 ఎకరాల్లో రూ.కోట్ల వి లువ చేసే మట్టిని తవ్వి అక్రమంగా తరలించారు.

దేవుని మాన్యంలో అక్రమ తవ్వకాలు
విరుపాక్షేశ్వర స్వామి దేవాలయం

18 ఎకరాల్లో రూ.కోట్ల విలువ చేసే మట్టి మాయం

రాళ్లు తేలి గుంతలమయమైన భూమి

వృథాగా మరో 12 ఎకరాలు

అధికారుల నిర్లక్ష్యంతో ఆగని తవ్వకాలు


గుంతకల్లు టౌన, మే 17: దేవుని మాన్యానికి రక్షణ  కరువైంది. దేవాలయానికి సంబంధించిన 18 ఎకరాల్లో రూ.కోట్ల వి లువ చేసే మట్టిని తవ్వి అక్రమంగా తరలించారు. పర్యవేక్షించాల్సిన దేవదాయ, రెవెన్యూ, మైనఅండ్‌ జియాలజి అధికారులు చో ద్యం చూస్తున్నారు. హైవేలో రాకపోకలు ప్రారంభమైతే 12 ఎకరాల భూమి అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉంది. మండలంలో ని దోనిముక్కల గ్రామంలో వెలసిన విరుపాక్షేశ్వర స్వామి ఆలయానికి సర్వేనెంబరు 2లో 40 ఎకరాల భూమి ఉంది. ఇందులో 10 ఎకరాలను ఎస్సీ కార్పొరేషన ద్వారా గ్రామంలోని ఎస్సీలకు సాగు చేయడానికిచ్చారు. 18 ఎకరాలను జీ కొట్టాల గ్రామ స మీపంలోని ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మాణం కోసం కాంట్రాక్టర్‌ కోట్ల విలువ చేసే మట్టిని అక్రమంగా తవ్వి తరలించాడు. మిగిలిన 12 ఎకరాల భూమి వృథాగా ఉంది. పిచ్చిమొక్కలు మొలిశాయి. ఆ భూమిని దేవదాయ శాఖ అధికారులు చదును చేస్తే సాగు చేయడానికి ఉపయోగపడుతుంది. లేదా ఆలయం తరపున గో శాల కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆశాఖ అధికారులు ఈ 12 ఎకరాలు అన్యాక్రాంతం కాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం హైవే పక్కన భూమి విలువ కోట్ల రూపాయలు విలువ చేస్తోంది. హైవేలో వాహనాల రాకపోకలు ప్రారంభమైతే భూమి కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉంది. దేవదాయ శాఖ అధికారులు ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరమెంతైనా ఉంది.


పట్టించుకోని అధికారులు

జీ కొట్టాల గ్రామ సమీపాన 2011లో గుంతకల్లు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మాణం చేపట్టారు. ఈ ని ర్మాణ పనులను ఇండియా ప్రాజెక్టు లిమిటెడ్‌ టెండర్‌ ద్వారా ద క్కించుకుంది. ఈ కంపెనీ కాంట్రాక్టర్‌ విరుపాక్షేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన 18 ఎకరాల భూమిలో 20 అడుగులలో తు, 1.68 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని అక్రమంగా తరలించారు. ఆ మట్టిని తరలించేటప్పుడు పర్యవేక్షించాల్సిన దేవదాయ, రెవె న్యూ, మైన్సఅండ్‌జియాలజి, పోలీసులు పట్టించుకున్న పాపానపోలేదు. కాంట్రాక్టర్ల నుంచి గ్రామ పెద్దలు రూ.9 లక్షలు వసూ లు చేశారు. ఆ డబ్బుతో గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆ భూమిలో పెద్దపెద్ద రాళ్లు దర్శనమిస్తున్నాయి. ఈభూమిలో మట్టి తవ్వకం ఆగడం లేదు. ట్రా క్టర్ల ద్వారా యథేచ్ఛగా మట్టిని తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎర్రమట్టి కావడంతో మంచి గిరాకీ ఉండటం తో అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని గతంలో విశ్వహిందూ పరిషత, భజరంగదళ్‌ నాయకులు కోర్టును ఆశ్రయించారు. 


ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి

 ఎన సంజీవమ్మ, ఆలయ మాజీ కమిటీ చైర్మన

విరుపాక్షేశ్వర స్వామి ఆలయానికి చెందిన భూమికి దేవదా య శాఖ అధికారులు ఫెన్నింగ్‌ ఏర్పాటు చేయాలి. కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. 12 ఎకరాల భూమిని చదును చే సి సాగులోకి తేవాలి. గుంతలు తవ్విన భూమిలో మట్టితో పూడ్చాలి. 


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా

 దేవదాసు, ఈఓ

విరుపాక్షేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన 12 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్‌ వేయడానికి, చదును చేయడానికి అసిస్టెంట్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తాం. భూమి కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం.Updated Date - 2021-05-18T06:06:57+05:30 IST