వ్యాక్సిన వేయించుకోకపోతే పింఛన కట్‌

ABN , First Publish Date - 2021-05-02T06:22:13+05:30 IST

కరోనా వ్యాక్సిన వేయించుకుంటేనే వృద్ధాప్య పింఛన ఇస్తామంటూ వలంటీర్‌ బెదిరించడంతో 90ఏళ్ల వృద్ధుడు చేసేది ఏమీ లేక వేయించుకున్నాడు.

వ్యాక్సిన వేయించుకోకపోతే పింఛన కట్‌

ఓ వలంటీర్‌ బెదిరింపులు!

పింఛన పోతుందని 90 ఏళ్ల వృద్ధుడికి వ్యాక్సిన

చేయికి స్వర్శలేకుండా పోయిన వైనం

 ధర్మవరం, మే 1:  కరోనా వ్యాక్సిన వేయించుకుంటేనే వృద్ధాప్య పింఛన ఇస్తామంటూ వలంటీర్‌ బెదిరించడంతో 90ఏళ్ల వృద్ధుడు చేసేది ఏమీ లేక వేయించుకున్నాడు. అది కాస్తా వికటించడంతో చెయ్యికి స్పర్శ పడిపోవడంతో మం చానికే పరిమితమైన సంఘటన ధర్మవరంలోని సంజయ్‌నగర్‌లో చోటు చేసుకుం ది. వివరాల మేరకు పట్టణంలోని సంజయ్‌నగర్‌లో ఈరనాల శ్రీరా ములు (90) నివాసముంటున్నాడు. ఏప్పిల్‌ 19న సంజయ్‌నగర్‌ సచివాల యంలో పనిచేస్తున్న ఓ వాలంటీర్‌ అతని ఇంటికి వెళ్లి కరోనా దృష్ట్యా వ్యాక్సిన వేయించుకోవాలని ఆ వృద్ధుడికి సూచించినట్టు శ్రీరాములు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో 90ఏళ్ల వృద్ధుడికి వ్యాక్సిన వద్దని వలంటీర్‌కు చెప్పామన్నారు. వ్యాక్సిన వేయించుకుంటేనే పింఛన వస్తుందని బెదిరించాడని తెలిపారు. దీంతో వృద్ధుడికి వ్యాక్సిన వేయించామన్నారు. అరగంటకు కళ్లు తిరిగి పడిపోగా మూడు రోజుల తరువాత వ్యాక్సిన వేయించుకున్న ఎడమచెయ్యి స్పర్శ పూర్తిగా పడిపోయిందని కుటుంబికులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన వల్లే శ్రీరాములకు చెయ్యి స్పర్శపడిపోయిందా లేక మరే ఇతర కారణాల వల్ల అనేది  వైద్యులే నిర్దారించవలసి ఉంది.


Updated Date - 2021-05-02T06:22:13+05:30 IST