భర్త హత్య

ABN , First Publish Date - 2021-12-30T06:02:09+05:30 IST

మండలంలోని మే డిమాకులపల్లి గ్రామంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని కట్టుకున్న భర్త వీరన్న (50)ను భార్య రేణుక, ఆమె ప్రియుడు షెక్షావలి, అతడి స్నేహితుడు కలిసి బుధవారం హత్య చేశారని మృతు డి తల్లి ఫక్కీర మ్మ, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

భర్త హత్య
వీరన్న మృతదేహం

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ...


పెద్దవడుగూరు, డిసెంబరు29: మండలంలోని మే డిమాకులపల్లి గ్రామంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని కట్టుకున్న భర్త వీరన్న (50)ను భార్య రేణుక, ఆమె ప్రియుడు షెక్షావలి, అతడి స్నేహితుడు కలిసి బుధవారం హత్య చేశారని మృతు డి తల్లి ఫక్కీర మ్మ, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. వారు తెలిపిన మేరకు మేడిమాకులపల్లి గ్రామానికి చెందిన దంపతులు వీరన్న, రేణుక వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఒకరు చనిపోగా ఒకరు ఉన్నా రు. వ్యవసాయ కూలి పనుల్లో రేణుకకు షెక్షావలి పరిచయమయ్యాడు. వీరి పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. మూర్ఛవ్యాధితో బాధపడే భర్త తమ వివా హేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడు షెక్షావలికి రేణుక తెలిపింది. ప్రియుడి ప్రోత్సాహంతో అతడి స్నేహితుడు దస్తగిరితో కలిసి రేణుక ఇంటి ఆవరణలో ఉన్న భర్తపై మధ్యాహ్నం దాడిచేసింది. ఈ దాడిలోగా యపడ్డ వీరన్న అక్కడికక్కడే మృతిచెందాడు. పామిడి సీఐ రవి శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుల పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-12-30T06:02:09+05:30 IST