మొరాయించిన సర్వర్ - ఆగిన రిజిస్ట్రేషన్లు
ABN , First Publish Date - 2021-04-17T05:48:24+05:30 IST
స్థానిక సబ్‌రిజిస్ర్టార్ కార్యాయంలో శుక్రవారం సర్వర్ మొరాయించింది. దీంతో రిజి స్ట్రేషన్ల ప్రకియ నిలిచిపోయిం ది.
ఉరవకొండ, ఏప్రిల్ 16: స్థానిక సబ్‌రిజిస్ర్టార్ కార్యాయంలో శుక్రవారం సర్వర్ మొరాయించింది. దీంతో రిజి స్ట్రేషన్ల ప్రకియ నిలిచిపోయిం ది. జిల్లాలోని ఉరవకొండ, గుంతకల్లు రిజిస్ర్టార్ ఆఫీసు ల్లో మూడు రోజుల నుంచి రి జిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన చేయించుకునేందుకు వ చ్చిన ప్రజలు కార్యాలయం వ ద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఉదయం నుంచి సా యంత్రం వరకు సర్వర్లు పనిచేయక పోవడంతో ప్రజలు నిరాశగా వెనుదిరిగారు. మూడు రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఉరవకొం డ కార్యాలయంలో 60 దాకా రిజిస్ట్రేషన డాక్యుమెంట్లు ఆగిపోయాయి. సాంకేతిక సమస్య తోనే రిజిస్ట్రేషన ప్రక్రియ నిలిచిపోయిందని సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయ అధికారులు తెలిపారు.