కరోనా వారియర్స్‌కు వేతన వెతలు

ABN , First Publish Date - 2021-07-08T06:38:43+05:30 IST

కరోనా వారియర్స్‌కు వేతన వెతలు వెంటాడుతున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రాణాలు ఫణంగా పెట్టి, బాధితులకు వారు అందిస్తు న్న సేవలు అమోఘమంటూ పాలకులు, అధికారులు కొనియాడుతున్నారు.

కరోనా వారియర్స్‌కు వేతన వెతలు

నాలుగు నెలలుగా అందని జీతాలు

ఆస్పత్రి పారిశుధ్యకార్మికుల ఆందోళన

అనంతపురం వైద్యం, జూలై7: కరోనా వారియర్స్‌కు వేతన వెతలు వెంటాడుతున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రాణాలు ఫణంగా పెట్టి, బాధితులకు వారు అందిస్తు న్న సేవలు అమోఘమంటూ పాలకులు, అధికారులు కొనియాడుతున్నారు. అలాంటి వారియర్స్‌కు వేతనాల విషయానికొచ్చే సరికి మొండిచేయి చూపుతున్నారు. నె లల తరబడి జీతాలు అందక అల్లాడుతున్నారు. తమకు జీతాలు ఇప్పించండని వేడుకుంటున్నా.. పాలకులు, అధికారుల నుంచి స్పందన కనిపించడం లేదు. జిల్లా సర్వజనాస్పత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు ఐదు నెలలుగా జీతాలు అందలేదు. దీంతో ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అనేకసార్లు అధికారులను వేడుకున్నా.. ఫలితం లేకపోవడంతో బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. జిల్లా ఆస్పత్రి ప్రధాన గేటు ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు రాజారెడ్డి మాట్లాడుతూ నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడం తో పారిశుధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కొంతమంది కార్మికులు ఇంటి అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారన్నారు. వారియర్స్‌ అని పొ గుడుతున్నారే తప్పా.. వారి బతుకుల గురించి ఆలోచించట్లేదన్నారు. వెంటనే అధికారులు స్ప దించి, వేతనాలు అందేలా చూడాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ని రసనలో ఏఐటీయూసీ నాయకులు రాజే్‌షగౌడ్‌, కృష్ణు డు, మెడికల్‌ కాంట్రాక్టు వర్కర్ల సంఘం నాయకులు రామ్మోహన, రామాంజనేయులు, కళావతి, భార్గవి, పె ద్దన్న, సువర్ణమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-08T06:38:43+05:30 IST