హోంగార్డుల సంక్షేమానికి విశేష కృషి

ABN , First Publish Date - 2021-12-31T05:33:39+05:30 IST

జిల్లా పోలీసు శాఖలోని హోంగార్డుల స ంక్షేమానికి ఎస్పీ డాక్ట ర్‌ ఫక్కీరప్ప విశేష కృషి చేస్తున్నారని రా ష్ట్ర బెటాలియనల వి భాగం, హోంగార్డుల విభాగ అదనపు డీజీపీ శంకబ్రత బగ్చీ పేర్కొన్నారు.

హోంగార్డుల సంక్షేమానికి విశేష కృషి

అదనపు డీజీపీ శంకబ్రత బగ్చీ

అనంతపురం క్రైం, డిసెంబరు 30: జిల్లా పోలీసు శాఖలోని హోంగార్డుల స ంక్షేమానికి ఎస్పీ డాక్ట ర్‌ ఫక్కీరప్ప విశేష కృషి చేస్తున్నారని రా ష్ట్ర బెటాలియనల వి భాగం, హోంగార్డుల విభాగ అదనపు డీజీపీ శంకబ్రత బగ్చీ పేర్కొన్నారు. గురువారం ఆయన స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీతో కలిసి హోంగార్డుల దర్బారు నిర్వహించారు. పలువురు హోంగార్డులు తమ స మస్యలపై వినతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హోంగార్డుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. సమస్యలను సకాలంలో పరిష్కరిస్తామన్నారు. వైద్య, వివాహ గ్రాంట్ల విషయమై త్వరలోనే శుభ వార్త చెబుతామన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. హోం గార్డుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అనంతరం ఏడుగురు హోంగార్డులకు అతి ఉత్కృష్ట, ఉత్కృష్ట అవార్డులను అందజేశారు. కార్య క్రమంలో రాయలసీమ హోంగార్డు కమాండెంట్‌ రామ్మోహనరావు, ఏఆర్‌ అదనపు ఎస్పీ హనుమంతు, తిరుపతి హోంగార్డు డీఎస్పీ లక్ష్మణ్‌ కుమార్‌, కర్నూలు హోంగార్డు డీఎస్పీ రవీంద్రారెడ్డి, ఆర్‌ఐ టైటాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:33:39+05:30 IST