ఆ సర్కిల్‌కు ఆయనే రియల్‌ బాస్‌

ABN , First Publish Date - 2021-12-31T06:36:17+05:30 IST

ఆ సీఐ రూటే సపరేటు. అధికారంలో ఎవరుంటే వారికి వత్తాసు పలకడం. వారి కనుసన్నల్లో పనిచేసుకుపోవడం ఆ అధికారికి వెన్నతో పెట్టిన విద్య.

ఆ సర్కిల్‌కు ఆయనే రియల్‌ బాస్‌

ఆ సీఐ రూటే సప‘రేటు’

అధికారం ఎవరి పక్షమైతే వారికే వత్తాసు

కాసులు దండుకోవడమే ప్రవృత్తి

వివాదాస్పద భూములే లక్ష్యం

పోలీస్‌స్టేషనే సివిల్‌ పంచాయితీలకు అడ్డా 

మాట వినకపోతే... 

కేసుల బూచితో బెదిరింపులు

ఆ అధికారి పేరు వింటేనే హడలిపోతున్న బాధితులు

అనంతపురం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):  ఆ సీఐ రూటే సపరేటు. అధికారంలో ఎవరుంటే వారికి వత్తాసు పలకడం. వారి కనుసన్నల్లో పనిచేసుకుపోవడం ఆ అధికారికి వెన్నతో పెట్టిన విద్య. వృత్తి పోలీస్‌ అయి నా... భూములు, సివిల్‌ పంచాయితీలు చేసి కాసులు దండుకోవడం ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. వివాదాల్లో ఉన్న భూములే ఆదాయ వనరుగా మార్చుకుంటూ సొ మ్ము చేసుకుంటున్నాడు. ఎవరైనా మాట వినకుంటే పోలీస్‌ పవర్‌ చూపిస్తాడు. బాధితులకు కేసుల భయం చూపి హడలెత్తిస్తుంటాడు. ఆ సర్కిల్‌ పరిధిలోని చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆ సీఐ అంటేనే అందరూ హడలెత్తి పోతున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే ఆ సీఐ దగ్గరకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. నేనింతే... నేనే రియల్‌ బాస్‌. నాకు రియల్‌ బాస్‌లు ఎవరూ లేరన్న ధోరణిలో ఆ సీఐ వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ నలుగురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కలిసినా... ఆ సీఐ దగ్గరకు మాత్రం రియల్‌, భూ పంచాయితీలు తీసుకె ళ్లొద్దని చర్చించుకుంటున్నారంటే... ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు రాజకీయ వివాదాల్లోనూ కేంద్ర బిందువుగా మారుతున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నా యి. పోలీసు అధికారిగా శాంతిభద్రతలను పరిరక్షించాల్సి న ఆయనే శాంతిభద్రతలకు విఘాతం కలిగే విధంగా వ్య వహరిస్తున్నారన్న అభిప్రాయం ఆ ప్రాంతంలో వ్యక్తమ వుతోంది. బాధితులు ఏ పార్టీ వారైనా... వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసు అధికారిగా ఆ సీఐపై ఉం టుంది. అయితే ఆ సీఐ మాత్రం అధికార పక్షానికే తాను అధికారినన్న చందంగా పనిచేస్తున్నారన్న విమర్శలు విని పిస్తున్నాయి. ఇంత వివాదాస్పదమైన సీఐ మరెవరో కాదు ధర్మవరం పోలీస్‌ సబ్‌ డివిజనలోని ఓ సర్కిల్‌ అధికారి. ఆయన పేరులో ‘చిన్న’ ఉన్నా... చేసేవి మాత్రం అన్నీ పెద్ద పంచాయితీలేనని ఆ శాఖ వర్గాలే కాకుండా స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. 


ఓ డాబా నుంచి అధికార పార్టీ నేతల ఆదేశాలు... పోలీస్‌స్టేషనలో పంచాయితీలు

ఆ సీఐ కాసులు దండుకోవడమే పరమావధిగా భావిం చాడోఏమోగానీ... అధికార పార్టీ నేతలు ఏ ఆదేశాలు జారీ చేసినా... తూ.చా. తప్పకుండా పనిచేస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. స్థానిక ప్రజాప్రతినిధి సోదరు లు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్లడంతో పాటు వారు ఆదే శించిన మేరకే నడుచుకుంటూ స్వకార్యం, స్వామికార్యం రెండూ పూర్తి చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా భూ వివాదం తలెత్తినా, రియల్‌ వ్యవహారంలో బేధాభిప్రాయాలు వచ్చినా, ఎవరైనా భూములు అమ్మేందు కు ఇష్టపడకపోయినా స్థానిక అధికార పార్టీ నేతలు ఆ ప్రజాప్రతినిధుల సోదరులకు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రజాప్రతినిధి సోదరులు ఆ పనులను చక్కబెట్టేలా ఆ అధికారికి పని అప్పజెప్తున్నట్లు తెలు స్తోం ది. సర్కిల్‌ కార్యాలయం జాతీయ రహదారికి దూరంగా ఉండటంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న పోలీస్‌ స్టేషననే పంచాయితీలకు ఆ అధికారి అడ్డాగా మార్చుకు న్నారన్న విమర్శలున్నాయి. ఆ స్టేషనకు సమీపంలో  జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ డాబా వద్దకు ఆ ప్ర జాప్రతినిధుల సోదరులు ఆ సీఐను పిలిపించుకొని అక్క డే వివాదాస్పద భూ పంచాయతీల సమాచారాన్ని అం దించి వాటిని చక్కబెట్టాలని చెబుతున్నట్లు సమాచారం. ఆ ప్రజాప్రతినిధుల సోదరులు చెప్పిందే తడవుగా ఆ అ ధికారి ఎవరైతే భూములకు సంబంధించిన హక్కుదారు లున్నారో వారిని స్టేషనకు పిలిపించి ఖాకీ పవర్‌కు తోడు అధికార పార్టీ రాజకీయాన్ని జోడించి పనులు చక్కదిద్ది రూ. లక్షలు సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకుల సమ క్షంలోనే ఈ వివాదాలు పరిష్కరిస్తుండటం గమనార్హం. ఒక్కమాట లో చెప్పాలంటే... వివాదాస్పద భూములు, రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలు చక్కదిద్దడంలోనే ఆయన తరిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. 


ఆ అధికారి చేసిన పంచాయతీలు, సెటిల్‌మెంట్ల చిట్టా లో కొన్ని..

ఆ సర్కిల్‌ స్థాయి అధికారి చేసిన భూ పంచాయితీలు, సెటిల్‌మెంట్‌ చిట్టా చాంతాడంత ఉన్నప్పటికీ... అందులో మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే... రాప్తాడు నియోజకవ ర్గంలోని జాతీయ రహదారికి ఆఖరి మండల కేంద్రం సమీపంలో నాలుగెకరాల భూ వివాదాన్ని పరిష్కరించి ఓ రియల్టర్‌ నుంచి రూ. 5 లక్షల వరకూ ముడుపులు తీసు కున్నట్లు సమాచారం. అదే ప్రాంతంలో మరోస్థల వివా దంలో ఆ ప్రాంతానికే చెందిన ఓ వ్యాపారి నుంచి రూ. లక్షల్లో ముడుపులు దండుకున్నట్లు తెలుస్తోంది. ఆ మం డల కేంద్రంలోని ఓ గ్రామానికి చెందిన దాయాదుల మధ్య నాలుగెకరాల భూ వివాదానికి సంబంధించి ఇరువ ర్గాల నుంచి రూ. 6 లక్షలదాకా వసూలు చేసినట్లు ఆరో పణలున్నాయి. అదేవిధంగా ఎనఎ్‌స గేటు సమీపంలో 7 ఎకరాల భూమిని ధర్మవరానికి చెందిన ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. ఆ భూమిని తక్కువ ధరకు కొట్టేసేం దుకు అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో ఆ వ్యక్తిని బె దిరించి తక్కువ ధరకు భూమిని అధికార పార్టీ నాయకు లకు కట్టబెట్టి రూ. 5 లక్షలు సొమ్ము చేసుకున్నట్లు ఆరో పణలున్నాయి. అదే ప్రాంతంలో ఓ లేఔట్‌ యజమానిని కాసుల కోసం బెదిరించడంతో పాటు స్టేషనకు రావాలని ఒత్తిడి చేయడంతో  భయంతో ఆయన ఆస్పత్రి పాలైనట్లు సమాచారం. సర్కిల్‌ పోలీ్‌సస్టేషన కేంద్రంలోని ఓ పల్లెలో భూ వివాదంలో రూ. 3 లక్షలు వసూలు చేసినట్లు తెలు స్తోంది. అదే మండలానికి సంబంధించి హైవేకి దగ్గరగా ఉన్న ఓ విలువైన భూమికి సంబంధించి యజమానులను కాసుల కోసం బెదిరించినట్లు విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ అధికారి పనితీరు వివాదాస్పదంగా మారుతు న్నా పంచాయితీల్లో ఆరితేరుతున్నా అధికార పార్టీ ముఖ్య నేతల అండదండలు ఉండటంతో ఉన్నతాధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆ శాఖ వర్గాల్లోనే చర్చకు దారితీస్తోంది.  

Updated Date - 2021-12-31T06:36:17+05:30 IST