నిరుపేదలను వేధిస్తే వైసీపీకి పుట్టగతులుండవు

ABN , First Publish Date - 2021-12-26T06:05:42+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో నిరుపేదలను వేధిస్తే వైసీపీకి పుట్టగతు లుండవని ద్విసభ్య కమిటీ సభ్యుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు పేర్కొన్నారు.

నిరుపేదలను వేధిస్తే వైసీపీకి పుట్టగతులుండవు
సమావేశంలో మాట్లాడుతున్న ఆలం నరసానాయుడు




- గౌరవ సభలో ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం

నార్పల, డిసెంబరు25 : ఓటీఎస్‌ పేరుతో నిరుపేదలను వేధిస్తే వైసీపీకి పుట్టగతు లుండవని ద్విసభ్య కమిటీ సభ్యుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు పేర్కొన్నారు. మండలంలోని నడిమి దొడ్డి, గడ్డంనాగేపల్లిల్లో  శనివారం టీడీపీ గౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  ఆలం నరసానాయుడు మా ట్లాడుతూ... ఓటీఎస్‌ పేరుతో పేద ప్రజల నుంచి వైసీపీ నా యకులు, గ్రామ వలంటీర్లు రూ. 10 వేలు బలవంతపు వసూళ్లు చేస్తున్నారన్నారు. ఓటీఎస్‌ ఎవరూ కట్టవద్దని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే పేదల కోసం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉచితంగా రిజిస్ర్టేషన్లు చేస్తారన్నారు. అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ఆదుకో కపోవడం బాధాకరమన్నారు. మామిడి, వరి, వేరుశనగ, అరటి, చీనీ, మిరప, టమోటా తదితర పంటలు అకాల వర్షాలకు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వైసీపీ నాయకులు, ప్రభుత్వం వారి వైపు కన్నెత్తి  చూడడం లేదన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అన్ని రాష్ర్టాల్లో తగ్గించినా మన రాష్ట్రంలో సీఎం జగన రెడ్డి తగ్గించకుండా నిరుపేద మధ్య తరగతి వర్గాల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ వైసీపీని తరిమికొట్టి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పి ట్టు రంగారెడ్డి, రాఘవనాయుడు, వెంకటేశ్వర నాయుడు, తిప్పన్న, జాఫర్‌వలి, చంద్ర బాబు, బొగ్గు నారాయణస్వామి, తిరుపతి నాయుడు, కర్ణపొడికి ఈశ్వరయ్య, నాగరాజు, రామాంజి, బాలయ్య, బోరు నాగార్జున, వెంకటరాముడు, మల్లికార్జున, నడిమిదొడ్డి సర్పంచ నాగార్జున, గడ్డంనాగేపల్లి సర్పంచ నాగన్న పాల్గొన్నారు.


Updated Date - 2021-12-26T06:05:42+05:30 IST