కరోనా దెబ్బకు ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ
ABN , First Publish Date - 2021-05-21T06:19:30+05:30 IST
కరోనా దెబ్బతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలలాడుతున్నాయి.

లేపాక్షి, మే 20 : కరోనా దెబ్బతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలలాడుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు మాత్రమే ప్రత్యేక అవసరాల కోసం సడలింపు ఇవ్వడంతో ప్రజలు ఆ సమయాన్ని నిత్యావసర వస్తువులు కొనుగోలుకే కేటాయిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు సాహసించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కొంతమందికి పాజిటివ్ రావడంతో సిబ్బంది కూడా అరకొరగా విధులకు వస్తున్నారు. రైతులు 1బి కోసం, పాసుపుస్తకాల కోసం కూడా కార్యాలయాలవైపు వెళ్లడం లేదు.