ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలు వేగవంతం చేయాలి: ఎంపీడీఓ

ABN , First Publish Date - 2021-06-22T06:24:16+05:30 IST

ప్రభుత్వం గ్రామాల్లో నూతనంగా చేపట్టిన సచివాయ, ఆర్బీకే, విలేజ్‌ క్లీనిక్‌ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆ యా మండలాల ఎంపీడీఓలు సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలు వేగవంతం చేయాలి: ఎంపీడీఓ

విడపనకల్లు/బొమ్మనహాళ్‌/గుత్తి/బ్రహ్మసముద్రం/శెట్టూరు/వజ్రకరూరు, జూన 21: ప్రభుత్వం గ్రామాల్లో నూతనంగా చేపట్టిన సచివాయ, ఆర్బీకే, విలేజ్‌ క్లీనిక్‌ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆ యా మండలాల ఎంపీడీఓలు సంబంధిత అధికారులను ఆదేశించారు. సో మవారం విడపనకల్లు ఎంపీడీఓ శ్రీనివాసులు, పీఆర్‌ ఏఈ వెంకట శేష య్య చీకలగురికి, డొనేకల్లు, గడేకల్లు, అంచనహాలు గ్రామాల్లోని సచివాలయాలను పరిశీలించారు. బొమ్మనహాళ్‌ ఎంపీడీవో సరస్వతి ఉద్దేహాళ్‌, బం డూరు గ్రామాల్లో పర్యటించి, కాంట్రాక్టర్లతో చర్చించారు. ఈవోపీఆర్డీ కు మార రంగయ్య, పంచాయతీ కార్యదర్శి హేమాంజలి, రాఘవేంద్ర ఆమె వెంట ఉన్నారు. గుత్తి మున్సిపల్‌ పరిధిలోని ఒకటవ వార్డులో చేపడుతు న్న వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌ నిర్మాణ పనులను చైర్‌పర్సన వన్నూరుబీ, కమిషనర్‌ గంగిరెడ్డి పరిశీలించారు. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి లో ఎంపీడీఓ రామకృష్ణ పర్యటించి భవన నిర్మాణాలు పరిశీలించారు. అ నంతరం సచివాలయంలో సర్పంచు, వార్డుమెంబర్లు, సచివాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ వెంకటనాయుడు, ఇం జనీర్‌ విజయకృష్ణ, ఏపీఓ అప్పుస్వామినాయుడు పాల్గొన్నారు. శెట్టూరు  మండలం అయ్యగార్లపల్లి, పెరుగుపాళ్యం, ములకలేడు, తిప్పనపల్లి గ్రా మాల్లో నిర్మాణ పనులను ఎంపీడీఓ వెంకటనాయుడు పరిశీలించారు.   ఆయనతోపాటు ఈఓఆర్డీ గంగావతి, ఏపీఓ ఓబురెడ్డి, సచివాలయ సిబ్బం ది ఉన్నారు. వజ్రకరూరు మండలం వెంకటాంపల్లిలో ఎంపీడీఓ రెహనాబేగం నిర్మాణ పనులు పరిశీలించి, వేగవంతంగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు  సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ ప్రసాద్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T06:24:16+05:30 IST