ధరల తగ్గింపులో ప్రభుత్వం విఫలం : కాలవ

ABN , First Publish Date - 2021-08-27T06:43:31+05:30 IST

రాష్ట్రంలో నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయా యని, తగ్గింపులో జగన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు.

ధరల తగ్గింపులో ప్రభుత్వం విఫలం : కాలవ
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం, ఆగస్టు 26: రాష్ట్రంలో నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయా యని, తగ్గింపులో జగన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. గురువారం పట్టణంలోని తెలుగుదే శం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు మండిపోతున్నాయన్నారు. తెలుగుదేశం పాలనలో లీటర్‌ డీజిల్‌ రూ.71.32 కాగా ఇప్పుడు రూ.99.62కు పెరిగిందన్నారు. లీటరు పెట్రోల్‌ ధర రెండేళ్ల క్రితం రూ.75.48 కాగా ప్రస్తుతం రూ.108.30కి పెరిగిందన్నారు. గ్యాస్‌ ధర సామాన్యులు భరించలేనంతగా వుందన్నారు. పెట్రో ఉత్పత్తు ల ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఈనెల 28న నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. బొ మ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌ నుంచి మండలకేంద్రం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 


ధర లేక రైతుల వ్యథ 

రైతులు పండించిన పంటకు కనీస ధర లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై సమావేశంలో టీడీపీ నాయకులతో కాలవ శ్రీనివాసులు చర్చించారు. ని యోజకవర్గంలో ఉల్లి, టమోటా, పచ్చి మిర్చి తదితర వాణిజ్య పంటల ఉత్పత్తులకు మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోయాయని పలువురు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మొ న్నటి దాకా 50 కిలోల ఉల్లి రూ.వెయ్యి నుంచి రూ.1500 ధర పలికింది. ప్రస్తుతం రూ. 300 నుంచి రూ.600లకు మించడం లేదన్నారు. టమోటా 15 కిలోల బాక్స్‌ రూ.20లకు  పతనమైందని, దీంతో చాలా మంది పంటలను అలాగే వదిలేస్తున్నారన్నారు. మరికొంతమంది మార్కెట్‌కు తీసుకెళ్లి ఎవరూ కొనుగోలు చేయక పోవడంతో రోడ్లపైనే పారవేస్తున్నారన్నారు. పచ్చిమిర్చి ధర కూడా కిలో రూ.పదికి మించడం లేదన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి విమర్శించారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే జగన్మోహన రెడ్డి అన్నదాతల జీవితాలను దుర్భ రం చేస్తారని మండిపడ్డారు. సమావేశంలో పట్టణ అధ్యక్షులు పసుపులేటి నాగరాజు, మం డల కన్వీనర్‌ హనుమంతరెడ్డి, కురుబ హనుమంతు, లాలెప్ప, నాయకులు కాటా హనుమంతరాయుడు, కాదలూరు మోహన రెడ్డి, పాలయ్య, సంతోష్‌ కుమార్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-27T06:43:31+05:30 IST