కరోనా నివారణలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-05-18T05:31:53+05:30 IST

కరోనా మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తీగా విఫలమైందని మాజీ ఎంపీ నిమ్మలకిష్టప్ప విమర్శించారు.

కరోనా నివారణలో ప్రభుత్వం విఫలం
నిమ్మల కిష్టప్ప

- మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప 

గోరంట్ల, మే 17: కరోనా మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తీగా విఫలమైందని మాజీ ఎంపీ నిమ్మలకిష్టప్ప విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ కరోనా నివారణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజల్లో అపోహలు తొలగించడం అవగాహన పెంపొందించడం ద్వారా ముందుగానే ప్రజలకు వ్యాక్సినేషన వేసే పరిస్థితి కల్పించలేదన్నారు. అలాగే వ్యాధిసోకిన వెంటనే గ్రామస్థాయిలో చేపట్టకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నాయి. జ్వరం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోవడానికి ఆసుపత్రుల్లో తగినన్ని కిట్‌లు లేవన్నారు. పరీక్షలు చేయించుకున్నా ఫలితం రావడానికి ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించారు. హిందూపురం, అనంతపురంలో బెడ్‌లులేక ఆక్సిజన లభించక మందులందక ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యపరిచి పాజిటివ్‌ కేసులను గుర్తించి హోమ్‌ ఐసొలేషనలో ఉంచి వైద్య సదుపాయాలను కల్పించాలని నిమ్మల కోరారు. 

Updated Date - 2021-05-18T05:31:53+05:30 IST