విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి

ABN , First Publish Date - 2021-10-30T05:23:06+05:30 IST

రాష్ట్రంలోని విద్యార్థులకు నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శంకర్‌నారాయణ

పెనుకొండ రూరల్‌, అక్టోబరు 29: రాష్ట్రంలోని విద్యార్థులకు నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి  శంకర్‌నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గుట్టూరు జెడ్పీహెచఎ్‌సలో ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈడీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నైపుణ్యరథంను మంత్రి శంకర్‌నారాయణ, ఎంపీ గోరంట్ల మాదవ్‌, సబ్‌ కలెక్టర్‌ నవీనలు ప్రారంభించారు. అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రిమాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థులకు సాంకేతి పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంతోపాటు నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం నైపుణ్యరథంను ప్రారంభించిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ మరోవైపు పారిశ్రామిక సాంకేతిక ఉత్పత్తి, విద్యా,వైద్య నైపుణ్యతలకు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారన్నారు. విద్యార్థులు కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా స్మార్ట్‌ఫోనల ద్వారా ప్రభుత్వ పథకాలను తెలుసుకోవడం సులభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ నవీన, జాయింట్‌ కలెక్టర్‌ గంగాధర్‌గౌడ్‌, డిప్యూటీ ఈఓ రంగస్వామి, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ జిల్లా అధికారి శ్రీకాంతరెడ్డి, తహసీల్దార్‌  నాగరాజు, జడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, ఎంపీపీ గీత , మార్కెట్‌యార్డ్‌ చైర్మన నాగలూరుబాబు, సింగిల్‌విండో చైర్మన శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యులు నారాయణస్వామి, సత్యనారాయణ, తిరుపాల్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-30T05:23:06+05:30 IST