వైభవంగా సీతారాముల కల్యాణం

ABN , First Publish Date - 2021-08-21T06:19:11+05:30 IST

మండల పరిధిలోని వీర ఓబనపల్లిలో సీతారాముల కల్యా ణోత్సవం నిర్వహించారు.

వైభవంగా సీతారాముల కల్యాణం

 ఓబుళదేవరచెరువు, ఆగస్టు 20: మండల పరిధిలోని వీర ఓబనపల్లిలో  సీతారాముల కల్యా ణోత్సవం నిర్వహించారు. శుక్రవా రం గ్రామంలో సీతారామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన, సీతారాముల కల్యాణో త్సవం గ్రామ పెద్దల, గ్రామస్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు. రెండు రోజులుగా ఆలయంలో మహాగణపతి పూజ, అంకురార్పణ, నవగ్రహ ఆరాధన, గ్రామోత్సవం, గణపతి, మృత్యుంజయ హోమాలు, కలశ స్థాపన కార్యక్ర మాలు నిర్వహించారు.  ఈ కార్యక్రమాలకు మండల నలుమూలల నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై కల్యాణోత్సవాన్ని వీక్షించారు. అనంతరం కదిరి మూర్తిపల్లికి చెందిన కౌన్సిలర్‌ రమణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 


Updated Date - 2021-08-21T06:19:11+05:30 IST