ఘనంగా తొలి ఏకాదశి

ABN , First Publish Date - 2021-07-21T06:32:30+05:30 IST

పట్టణంలో మంగళవారం తొలి ఏకాదశి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయం, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి, ఏటిగడ్డ ఆంజనేయస్వామి తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు.

ఘనంగా తొలి ఏకాదశి
తాడిపత్రిలో ప్రత్యేక అలంకరణలో శ్రీ రంగనాథస్వామి

తాడిపత్రిటౌన్‌ , జూలై 20 : పట్టణంలో మంగళవారం తొలి ఏకాదశి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయం, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి, ఏటిగడ్డ ఆంజనేయస్వామి తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. తొలి ఏకాదశి కావడంతో భక్తులు పెద్దఎత్తున స్వామివార్లను దర్శించుకున్నారు. 

తాడిపత్రిరూరల్‌: మండలంలోని ఆలూరు కోనలో మంగళవారం తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రంగనాథస్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఏకాదశి కావడంతో భక్తులు పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 


Updated Date - 2021-07-21T06:32:30+05:30 IST