మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవ్వండి : బీకే

ABN , First Publish Date - 2021-10-20T05:25:05+05:30 IST

త్వరలో జరుగనున్న పెనుకొండ మునిసిపాలిటీ ఎన్నికలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సన్నద్దం కావాలని టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు.

మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవ్వండి : బీకే
వార్డుల వారీగా సమీక్షిస్తున్న బీకే

పెనుకొండ టౌన, అక్టోబరు 19: త్వరలో జరుగనున్న పెనుకొండ మునిసిపాలిటీ ఎన్నికలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సన్నద్దం కావాలని టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనుకొండ, కోనాపురం, వెంకటరెడ్డిపల్లి గ్రామాలపరిధిలో 20వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయన్నారు. దీనికి  సంబంధించి శుక్రవారం 10గంటలకు స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరూ హాజరు  కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ శ్రీరాములు, మాజీ వైస్‌ ఎంపీపీ సిద్దయ్య, హుజురుల్లాఖాన, పాలడుగు చంద్ర, త్రివేంద్ర, అత్తర్‌ఖాదర్‌, తదితరులుపాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T05:25:05+05:30 IST