గ్యాస్‌, డీజల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-11-02T06:17:37+05:30 IST

పెరిగిన గ్యాస్‌, డీజల్‌, పెట్రోల్‌ ధరల ను తగ్గించాలని సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని యల్లనూరు రోడ్డు సర్కిల్‌లో కట్టెలపొయ్యి పెట్టి వినూత్నంగా నిరస న తెలిపారు.

గ్యాస్‌, డీజల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలి
తాడిపత్రిలో కట్టెల పొయ్యితో సీపీఎం నాయకుల నిరసన

తాడిపత్రి టౌన, నవంబరు 1  :పెరిగిన గ్యాస్‌, డీజల్‌, పెట్రోల్‌ ధరల ను తగ్గించాలని సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని యల్లనూరు రోడ్డు సర్కిల్‌లో కట్టెలపొయ్యి పెట్టి వినూత్నంగా నిరస న తెలిపారు.  ఈసందర్భంగా పట్టణ కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడు తూ డీజల్‌, పెట్రోల్‌ ధరల పెరుగుదలతో ప్రజానీకానికి నష్టం కలుగుతుందన్నారు. ఇంధనాల ధరలకు రెక్కలు రావడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శి ఉమాగౌడ్‌, కేవీపీఎస్‌ పట్టణ కార్యదర్శి రాంమోహన పాల్గొన్నారు.


ఉరవకొండ: పెట్రోల్‌, డీజల్‌ పెంపును నిరసిస్తూ సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక సీపీఐ కార్యాలయం నుంచి ప్రధాని దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. కవితా హోటల్‌ కూడలి లో పీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపా రు. కార్యక్రమంలో నాయకులు వన్నూర్‌ సాబ్‌, చెన్నరాయుడు, మల్లికార్జున, రంగారెడ్డి, మధు, జ్ఞానమూర్తి, శ్రీన, ఓబులేశు, రవి పాల్గొన్నారు. 


కూడేరు: వంటగ్యాస్‌ ధరను అమాంతంగా వంద రూపాయలకు పెంచడంతో సోమవారం సీపీఐ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. స్థానిక ప్రధాన రహదారి పక్కన కట్టెలతో పొయ్యి వెలిగించి టీ తయారు చేసి ప్రజలకు ఇస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మండల కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు రమణ, ముట్టాల శ్రీ రాములు, రమణప్ప, రామలింగయ్య, ఆదెమ్మ పాల్గొన్నారు.


Updated Date - 2021-11-02T06:17:37+05:30 IST