విద్యార్థి రోజులను నెమరేసుకున్న మిత్రులు

ABN , First Publish Date - 2021-03-22T05:48:39+05:30 IST

దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వా త మిత్రులు అందరూ ఒక్కచోట చేరారు. తాము చదువుకున్న పాఠశాలలో సమ్మేళనం నిర్వహించారు.

విద్యార్థి రోజులను నెమరేసుకున్న మిత్రులు

- 34 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు   

    ఓబుళదేవరచెరువు, మార్చి 21: దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వా త మిత్రులు అందరూ ఒక్కచోట చేరారు. తాము చదువుకున్న పాఠశాలలో సమ్మేళనం నిర్వహించారు. మండలంలోని కొండకమర్ల జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 1987-88 సంవత్సరం పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు అందరూ కలుసుకున్నారు. అప్పటి గురువులు బాబాఫక్రొద్దీనను దుశ్శాలువతో ఘనంగా సన్మానించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. చిన్ననా టి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కష్టసుఖాలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి గురువులు బాబాఫక్రొద్దీన మాట్లాడుతూ దాదాపు 34 సంవత్సరాల తర్వాత విద్యార్థులు కలసి సమ్మేళనం నిర్వహించడం ఆనందదాయకం అన్నారు. ఈ సమ్మేళనం ద్వారా అందరిని కలవడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, నల్లచెరువు ఎంపీడీఓ శకుంతల, ఆర్‌టీఎఫ్‌ హిదాయతుల్లా, కురుమాల చిన్నపరెడ్డి, అబీబుల్లా, జనరల్‌ మర్చంట్‌ నాగరాజు, నాగేంద్ర, టైలర్‌ రఫీ, సంగాల శీన, ఆంజనేయులు, కరుణాకర్‌రాజు, వెంకటనారాయణ, తారానాథ్‌, పర్వీనబాను, జయమ్మ, సుధామాధురి, బానుశ్రీ, విద్యావతి, శంకర, మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-22T05:48:39+05:30 IST