చిరుత కోసం అటవీ అధికారుల పహారా

ABN , First Publish Date - 2021-01-13T06:43:44+05:30 IST

మండలంలోని ఆవులదట్ల కంత్రాయణ గుట్టలో చిరుత సంచరిస్తోందనే విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు మూడు రోజుల నుంచి గుట్ట వద్ద పహారా కాస్తున్నారు.

చిరుత కోసం అటవీ అధికారుల పహారా
ఆవులదట్ల కొండపై పహారా కాస్తున్నఫారెస్టు అధికారుల

రాయదుర్గం రూరల్‌, జనవరి 12 : మండలంలోని ఆవులదట్ల కంత్రాయణ గుట్టలో చిరుత సంచరిస్తోందనే విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు మూడు రోజుల నుంచి గుట్ట వద్ద పహారా కాస్తున్నారు. డీఎ్‌ఫవో జగన్నాథ్‌ సింగ్‌ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఆర్వో రామ్‌సింగ్‌, శ్రీరాములు ఆధ్వర్యంలో అటవీ శాఖ స్పెషల్‌  రెస్క్యూ బృందాలతో గుట్ట వద్ద పహారా నిర్వహించారు. చిరుత జాడ గుర్తించి బోనులో బం ధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అ ధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్టు బీట్‌ ఆఫీసర్లు ఆంజనేయు లు, తిమ్మప్ప, స్పెషల్‌ రెస్క్యూ టీమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T06:43:44+05:30 IST