అత్తింటి వేధింపులతో బలవన్మరణం

ABN , First Publish Date - 2021-12-25T05:48:28+05:30 IST

అత్తింటివారి వేఽధింపులు తాళలేక ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సం ఘటన ముదిగుబ్బలో శుక్రవారం చో టుచేసుకుంది.

అత్తింటి వేధింపులతో బలవన్మరణం
గౌతమి (ఫైల్‌)

ముదిగుబ్బ, డిసెంబరు 24: అత్తింటివారి వేఽధింపులు తాళలేక ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సం ఘటన ముదిగుబ్బలో శుక్రవారం చో టుచేసుకుంది. ఎస్‌ఐ విజయకుమార్‌ తెలిపిన వివరాల మేరకు ... కడప జిల్లా పులివెందులకు చెందిన రమాదేవి, లేట్‌ రంగనాయకుల దంపతుల కుమార్తె గౌ తమి (20). మూడేళ్ల క్రితం ముదిగు బ్బకు చెందిన ఆదిలక్ష్మమ్మ, గంగయ్యల కుమారుడు మురళీతో ఆమెకు వివా హమైంది. గౌతమి అత్తింటిలోనే ఉండేది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. మురళీ పాండిచ్చేరిలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అక్కడ భారీ వర్షాల కారణంగా నెల నుంచి మురళీ ముదిగుబ్బలోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అత్తింటివారి వేధింపులతో తీవ్ర మనోవేధనకు గురైన గౌతమి వాటిని తాళలేక శుక్రవారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యానకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బజారుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన మురళీ తలుపు తట్టాడు. ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా గౌతమి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ప్రభుత్వాస్పత్రికి గౌతమిని తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు అత్తమామల వేధింపులే కారణమని గౌతమి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గౌతమి మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 


Updated Date - 2021-12-25T05:48:28+05:30 IST