గ్యాస్‌ లీకై చెలరేగిన మంటలు

ABN , First Publish Date - 2021-07-12T05:31:06+05:30 IST

మండల కేంద్రంలోనిఆర్‌అండ్‌బీ అతిధిగృహం వెనుక ఉన్న వీధిలో రహంతున్నీషా ఉదయం వంట చేస్తుండగా ఉన్న ఫలంగా గ్యాస్‌లీకై మంటలు చెలరే గాయి.

గ్యాస్‌ లీకై చెలరేగిన మంటలు

దగ్ధమైన ఇంటి సామగ్రి.. రూ. 5 లక్షల నష్టం

ముదిగుబ్బ, జూలై 11: మండల కేంద్రంలోనిఆర్‌అండ్‌బీ అతిధిగృహం వెనుక ఉన్న వీధిలో రహంతున్నీషా ఉదయం వంట చేస్తుండగా ఉన్న ఫలంగా గ్యాస్‌లీకై మంటలు చెలరే గాయి. దీంతో ఇంటిలో ఉన్న వారంత బయటకు పరుగులు తీశారు. స్థానికు లు చెలరే గుతున్న మంటలను అదు పుచేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ ఐ విజయ్‌కుమార్‌ సిబ్బందితో అక్క డికి చేరుకుని మంటలను ఆర్పివేయిం చారు. అయితే అప్పటికే  ఆస్తినష్టం జరిగిం దని కుటుంబసభ్యులు వాపోయారు. ఇంటిలో ఉన్న నిత్యావసర సరుకులు, బియ్యం, పట్టుచీ రలు, డబ్బు, బంగారం, బీరువా, వంటసామగ్రి కాలిబూడిదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దాదాపు రూ.5 లక్షల దాకా నష్టం వాటిలినట్టు బాధితులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరు తున్నారు.


Updated Date - 2021-07-12T05:31:06+05:30 IST