కొవిడ్ మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం
ABN , First Publish Date - 2021-07-24T06:23:15+05:30 IST
కొవిడ్ సెకండ్ వేవ్‌లో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రెడ్డెప్పరెడ్డి కుటుంబసభ్యులకు ఆర్టీసీ ఉద్యో గుల భాగస్వామ్యంతో రూ.5 లక్షలు ఆర్థికసాయం అందజేశారు

కదిరిఅర్బన, జూలై 23: కొవిడ్ సెకండ్ వేవ్‌లో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రెడ్డెప్పరెడ్డి కుటుంబసభ్యులకు ఆర్టీసీ ఉద్యో గుల భాగస్వామ్యంతో రూ.5 లక్షలు ఆర్థికసాయం అందజేశారు. ఈ మొత్తాన్ని శుక్రవారం కదిరి డీఎం రవీంద్రనాథ్‌రెడ్డి మృతుని భార్య లక్ష్మీదేవీకి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడు తూ కొవిడ్ బారిన పడి మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆర్టీసీ ఉద్యోగులు తమ నెల జీతంలో మూడు నెలల పాటు బేసిక్ పేలో రికవరీ సమ్మతిని తెలియ జేయడం అభినందనీయమన్నారు. తోటి ఉద్యోగులే ఆర్థిక సహాయం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్ సెకండ్ వేవ్‌లో ఆర్టీసీ ఉద్యోగులు ఫ్రెంట్‌లైన వారియర్స్‌లాగా పనిచేశారని అభినందించారు. కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకులు మోకా హరిమోహన, అకౌంటెంట్ బాలునాయక్, ట్రాఫిక్ ఇనచార్జ్ హరిత, స్టోర్ సూపర్‌వైజర్ నబీరసూల్, యూనియన నా యకులు దివాకర్, బైరిశె ట్టి, రామక్రిష్ణ, ఎనవీ రమణ, ఆర్‌ఎస్‌రెడ్డి, జీవైపీ రావు, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.