కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2021-12-28T05:55:25+05:30 IST

కొవిడ్‌తో మ రణించిన హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి జీ ఆర్పీ ఎస్పీ పీ అనిల్‌బా బు సోమవారం రూ.3 లక్షల చెక్కు అందజేశా రు.

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం
బాధిత కుటుంబీకులకు చెక్కు అందజేస్తున్న జీఆర్పీ ఎస్పీ అనిల్‌ బాబు

గుంతకల్లు, డిసెంబరు 27: కొవిడ్‌తో మ రణించిన హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి జీ ఆర్పీ ఎస్పీ పీ అనిల్‌బా బు సోమవారం రూ.3 లక్షల చెక్కు అందజేశా రు. స్థానిక రైల్వే డివిజనలోని రేణిగుంటలో హెడ్‌ కానిస్టేబుల్‌గా ప నిచేసిన సీఎస్‌ రాఘవ కరోనాబారిన పడి మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. మ్యాన కైండ్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ సుహృద్భావంతో బాధిత హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని పంపిందన్నారు. రాఘవ సతీమణి విజయకుమారి, కుమారుడు లీలసాయి కుమార్‌కు చెక్కును అందజేశారు. ప్రైవేటు కంపెనీ యాజమాన్యాన్ని ఎస్పీ అభినందించా రు. కార్యక్రమంలో జీఆర్పీ ఎస్పీ ఏఓ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-28T05:55:25+05:30 IST