దళారులను రైతులు నమ్మవ ద్దు

ABN , First Publish Date - 2021-11-10T05:26:23+05:30 IST

భూములు క్రయ, విక్రయ సమయాల్లో రైతులు నేరుగా కార్యాలయంలో సంప్రదించి సలహాలు తీసుకోవాలని హిందూపురం జిల్లా రిజిసా్ట్రర్‌ ఉమామహేశ్వరీ పిలుపునిచ్చారు.

దళారులను రైతులు నమ్మవ ద్దు
రికార్డులను తనిఖీ చేస్తున్న రిజిసా్ట్రర్‌

మడకశిర, నవంబరు 9: భూములు క్రయ, విక్రయ సమయాల్లో రైతులు నేరుగా కార్యాలయంలో సంప్రదించి సలహాలు తీసుకోవాలని హిందూపురం జిల్లా రిజిసా్ట్రర్‌ ఉమామహేశ్వరీ పిలుపునిచ్చారు. మంగళవారం మడకశిర కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రయ విక్రయ సమయాల్లో రైతులు దళారులకు కానీ క్రిందిస్థాయి సిబ్బందికి కానీ ముడుపులు చెల్లించి రిజిసే్ట్రషన చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయ భూమి రిజిసే్ట్రషన విషయంలో లంచం అడిగినట్లు వడ్రపాళ్యం గ్రామానికి చెందిన నంజప్ప అనే రైతు ఫిర్యాదు చేశారని, దానిపై విచారణ నిమిత్తం మడకశిర సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఆమె వెంట మడకశిర సబ్‌ రిజిసా్ట్రర్‌ శిరీష తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-11-10T05:26:23+05:30 IST