మల్లారెడ్డికి రైతు నేస్తం అవార్డు

ABN , First Publish Date - 2021-10-31T06:08:42+05:30 IST

ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరక్టర్‌ మల్లారెడ్డికి పద్మశ్రీ డాక్టర్‌ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కారం-2021 దక్కింది.

మల్లారెడ్డికి రైతు నేస్తం అవార్డు
మల్లారెడ్డికి పురస్కారం అందజేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుఅనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 30: ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరక్టర్‌ మల్లారెడ్డికి పద్మశ్రీ డాక్టర్‌ ఐవీ సుబ్బారావు  రైతు నేస్తం పురస్కారం-2021 దక్కింది. ముప్పవరకు ఫౌండేషన, రైతునేస్తం సం యుక్త ఆఽధ్వర్యంలో ఈ అవార్డును శనివారం నెల్లూరులో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా దెబ్బకు కూలిన దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన ఘనత రైతుకే దక్కిందని, దేశ ఆర్థిక రంగానికి వ్యవసాయమే ఆయువు పట్టు అని మరోసారి రుజువు చేసిందని అన్నారు.


Updated Date - 2021-10-31T06:08:42+05:30 IST