విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2021-11-23T06:54:56+05:30 IST

పొలం వద్ద ట్రాన్స ఫార్మర్‌లో ఫ్యూజులు వేయడానికి వెళ్లి విద్యుదాఘాతంతో రైతు బాబయ్య(49) మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి
బాబయ్య మృతదేహం

శింగనమల, నవంబరు22: పొలం వద్ద ట్రాన్స ఫార్మర్‌లో ఫ్యూజులు వేయడానికి వెళ్లి విద్యుదాఘాతంతో రైతు బాబయ్య(49) మృతి చెందాడు. పోలీసులు, బంధు వులు తెలిపిన మేరకు శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామానికి చెందిన రైతు బాబయ్య తన నాలుగు ఎకరా ల వ్యవసాయభూమిలో పెసర పంట సాగు చేశాడు. ఆదివారం రాత్రి తన పొలంలోని ట్రాన్సఫార్మర్‌లో ఫ్యూ జులు పోవడం గమనించాడు. దీంతో సోమవారం  స్వ యంగా ఫ్యూజులు వేసే ప్రయత్నం చేశాడు. అయితే ప్రమాదవశాత్తు విద్యుతషాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమీప పొలానికి చెందిన రైతులు కొంత సేప టికి గమనించి  కుటుంబ సభ్యులకు సమాచారం అందిం చారు. ఎస్‌ఐ వంశీకృష్ణ  సిబ్బందితో సంఘట స్థలాన్ని ప రిశీలించి కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని  అనంత పురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇటీవలే వివాహం చేశారు.

Updated Date - 2021-11-23T06:54:56+05:30 IST