విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2021-10-07T06:00:34+05:30 IST

మండలంలోని వెంకటరెడ్డిపల్లికి చెందిన రైతు శివశంకర్‌రెడ్డి (54) విద్యుదాఘాతంతో బుధవారం మృతిచెందాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి
శివశంకర్‌రెడ్డి మృతదేహం

 తాడిపత్రిటౌన, అక్టోబరు 6: మండలంలోని వెంకటరెడ్డిపల్లికి చెందిన రైతు శివశంకర్‌రెడ్డి (54) విద్యుదాఘాతంతో బుధవారం మృతిచెందాడు. రూ రల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శివశంకర్‌రెడ్డి ఉ దయం పొలానికెళ్లాడు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తేమ ఎక్కువగా ఉండింది. పంటకు నీరు పెట్టడానికి మో టారు ఆన చేయగా తేమతో విద్యుత షాక్‌ తగిలి, రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. శివశంకర్‌ రెడ్డికి భార్య మహేశ్వరి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు గరుడశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-10-07T06:00:34+05:30 IST