అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-02-01T06:38:01+05:30 IST
మండలంలోని కిష్టిపాడు గ్రా మానికి చెందిన రైతు నరేష్ (35) అప్పులబాధ తాళలేక ఆదివా రం విషద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పెద్దవడుగూరు, జనవరి 31: మండలంలోని కిష్టిపాడు గ్రా మానికి చెందిన రైతు నరేష్ (35) అప్పులబాధ తాళలేక ఆదివా రం విషద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలివి. నరేష్‌కు ఉన్న 3 ఎకరాల్లో వేరుశనగ, టమోటా పంటలు సాగుచేశాడు. సాగు కోసం రూ.3లక్షల మేర పెట్టుబడులు కాగా, ఆశించినస్థాయిలో దిగుబడి రాలేదు. దీంతో తెచ్చిన అప్పులను ఎలా తీర్చాలో మార్గం లేక మనస్తాపం చెందాడు. పొలం సమీపంలో విషద్రావకం తాగి అపస్మారక స్థితి లో పడిపోయాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచా రమిచ్చారు. బాధితున్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బం ధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.