రైతు బిడ్డ న్యాయప్రస్థానం

ABN , First Publish Date - 2021-10-22T06:07:42+05:30 IST

దశాబ్దం కిత్రం నల్లకోటు వేసుకుని న్యాయవాదిగా కోర్టులో అడుగు పెట్టిన ఓ సాధారణ రైతు బిడ్డ, రెడ్డిపల్లి వాసి రవికుమార్‌ తెలంగా ణ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు.

రైతు బిడ్డ న్యాయప్రస్థానం
జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన రెడ్డిపల్లి వాసి రవికుమార్‌

బుక్కరాయసముద్రం, అక్టోబరు21: దశాబ్దం కిత్రం నల్లకోటు వేసుకుని న్యాయవాదిగా కోర్టులో అడుగు పెట్టిన  ఓ సాధారణ రైతు బిడ్డ,  రెడ్డిపల్లి వాసి రవికుమార్‌ తెలంగా ణ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. న్యాయమూర్తిగా కావాలనే దృఢసంకల్పం, తపనతో ఆరు సార్లు పరీక్షలు రా సినా ఎంపిక కాలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడి లా ... ఏడోసారి తెలంగాణ జూనియర్‌ సివిల్‌ జడ్జి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నాయమూర్తిగా ఎంపికయ్యారు.  మండ లం నుంచి  జడ్జిగా ఎంపికైన తొలి వ్యక్తి కావడం పట్ల మండ ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డిపల్లికి చెందిన రైతు రామకృష్ణ, చౌడమ్మ దంపతలకు కుమారుడు రవికు మార్‌ 1నుంచి 5 వరకు రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో, 6 నుంచి 10 వరుకు బుక్కరాయసముద్రం జడ్పీ ఉన్నత పాఠ శాలలో చదివారు. అనంతపురంలోని జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌, ఆర్ట్స్‌ కళా శాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు.  పదేళ్లుగా అనంతపురంలో సీనియర్‌ న్యాయవాది కేఎల్‌ఎన ప్ర సాద్‌  వద్ద  జూనియర్‌ న్యా యవాదిగా పనిచేశారు. జూ నియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపి కైన సందర్భంగా రవికుమార్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడు తూ న్యాయవృత్తి ఎంతో గౌర వప్రదమైనదన్నారు. అందులో ఉన్న త స్థానం సాధించాలనే ఆ కాంక్షతో దశాబ్దం పాటు ఎ దురు చూశానన్నారు. ఆరు సార్లు పరీక్షల్లో ఫెయిల్‌ అయినా ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదన్నారు. ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో అనునిత్యం తపించానన్నారు. ఈ సాధనలో తన జీవిత భాగస్వామి సరస్వతి, తన తల్లితండ్రుల పాత్ర మరవలేదన్నారు. ఈ పదవితో మరింత బాధ్యత పెరిగిందన్నారు. 


Updated Date - 2021-10-22T06:07:42+05:30 IST