పొలంలోకూలీ మృతి

ABN , First Publish Date - 2021-12-26T05:32:26+05:30 IST

వ్యవసాయ కూలీ పనికి వెళ్లి ప్రమాదవశాత్తు రామాంజనేయులు(40) పంట పొలంలోనే మృతిచెందిన సంఘటన మండలంలోని సత్తారుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.

పొలంలోకూలీ మృతి
సంఘటనా స్థలంలో రైతు మృతదేహం

పెనుకొండ రూరల్‌, డిసెంబర్‌ 25: వ్యవసాయ కూలీ పనికి వెళ్లి ప్రమాదవశాత్తు రామాంజనేయులు(40) పంట పొలంలోనే మృతిచెందిన సంఘటన మండలంలోని సత్తారుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉప్పర రామాంజినేయులు పంట పొలాల్లో కూలీ పనిచేస్తు కుటుంబం పోషించేవాడు. ఈ తరుణంలో శుక్రవారం రోజూవారీలాగా సత్తారుపల్లిలో రైతు రఘునాథ్‌రెడ్డి పంట పొలంలో మొక్కజొన్న పంట వేసేందుకు రామాంజనేయులు వెళ్లాడు. తోటి కూలీలతో కలిసి శుక్రవారం సాయంత్రం పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. శనివారం ఉదయం రైతులు పొలంవద్దకు వెళ్లి చూడగా రామాంజినేయులు మృతిచెందడం గుర్తించి బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ రమే్‌షబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య రత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమే్‌షబాబు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - 2021-12-26T05:32:26+05:30 IST