సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2021-07-08T06:24:30+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైంది. బుధవారం సాయంత్రానికి ఏర్పా ట్లు పూర్తయ్యాయి

రాయదుర్గం, జూలై 7 : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైంది. బుధవారం సాయంత్రానికి ఏర్పా ట్లు పూర్తయ్యాయి. మంత్రులు కురసాల కన్నబాబు, శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటరామిరెడ్డి, ఉష శ్రీచరణ్, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాల కొండయ్య, కలెక్టర్ నాగలక్ష్మీ ఆ ఏర్పాట్లను పరిశీలించారు. రైతు దినోత్సవం సంద ర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాయ దుర్గం ప్రాంతంలో ప్రారంభించనున్న రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్‌ను పోలీసు ఉన్నతాధికారులు నిర్వహించారు. ఉడేగోళం గ్రామంలోని హెలీప్యాడ్ నుంచి అనంత పురం రోడ్డు మీదుగా మార్కెట్ యార్డు వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం మార్కెట్ యార్డు నుంచి కణేకల్లు రోడ్డు, లక్ష్మీబజారు మీదుగా మొలకాల్మూరు రోడ్డులో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు ట్రయల్ రన్ పరిశీలించారు. ఉదయం నుంచే పోలీసు యంత్రాంగాన్ని భారీగా మోహరించారు. రాయదుర్గం పట్టణంలో పూర్తిస్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అనంతపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం 2 గంటల వరకు నిలిపివేసి ఉడే గోళం నుంచి నడుపుతున్నట్లు ప్రకటించారు. కాగా బుధవారం తెల్లవారుజామున రాయదుర్గం పట్టణంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నీ నేలకొరిగాయి.