నగరపాలక సంస్థలో కమీషన్ల ఇంజనీర్లు !

ABN , First Publish Date - 2021-02-08T06:29:55+05:30 IST

నగరపాలక సంస్థలో ఇంజనీర్ల పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పనులను పర్యవేక్షించ కుండా ఆమ్యామ్యాలకు అలవాటు పడటంపై పలువురు పెదవివిరుస్తున్నారు.

నగరపాలక సంస్థలో కమీషన్ల ఇంజనీర్లు !
ఎన్టీఆర్‌ మార్గ్‌లో నిర్మించిన కాలువ

కార్పొరేషన్‌లో పనుల పర్యవేక్షణ నిల్‌

నాణ్యత ఉన్నా లేకున్నా కమీషన్‌ ఇవ్వాల్సిందే

బిల్లుల విషయంలోనూ ఇష్టారాజ్యం

ఐజాక్స్‌ కొలతలు(రేషియో) కూడా 

తెలియని ఏఈలు, డీఈలు

సీసీ డ్రెంుున్‌ల నిర్మాణాల్లోనూ లోపాలు

నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ 

విభాగంలో కొందరు ఘనులు

నోట్‌ఫైల్‌ డ్రాఫ్టింగ్‌లకూ కాంట్రాక్ట్‌ ఉద్యోగే ఆధారం


అనంతపురం కార్పొరేషన్‌,  ఫిబ్రవరి7 :  నగరపాలక సంస్థలో ఇంజనీర్ల పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పనులను పర్యవేక్షించ కుండా ఆమ్యామ్యాలకు అలవాటు పడటంపై పలువురు పెదవివిరుస్తున్నారు. నగరపాలక సంస్థలో ప్రతి ఏటా రూ.250కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు జరుగు తుంటాయి. బ్లాక్‌టా్‌ప(బీటీ)రోడ్లు, సీసీ రోడ్లు, కాలువ నిర్మాణాలు, పార్కుల అభివృద్ధి, రోడ్ల మరమ్మతులు ఇలా చాలానే ఉంటాయి. వీటి విషయంలో ఇంజనీరింగ్‌ విభా గానిదే కీలకపాత్ర. ఇక్కడ ఈఈలు, డీఈలు, ఏఈలతో పాటు వారి కింద వర్క్‌ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. సచివాలయ వ్యవస్థ ప్రారంభమైన తరువాత వార్డుల వారిగా ఇంజ నీరింగ్‌ అసిస్టెంట్లు కూడా వచ్చి చేరారు. ఇంత వ్యవస్థ ఉన్నా పనుల విషయంలో మాత్రం లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. చేసిన పనులు మధ్యలో వదిలేయడం మొద లుకొని అస్తవ్యస్థంగా చేయడం విమర్శలపాలవుతోంది. పనుల పర్యవేక్షణలో కొందరు డీఈలు, ఏఈలు నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్‌తో పని చేయించే సమయంలో వారిరువురు తప్పనిసరిగా ఉండా లి. కానీ  ఎక్కువ సమయాల్లో వర్క్‌ఇన్‌స్పెక్టర్లను, ఇంజ నీరింగ్‌ అసిస్టెంట్లను  పురమాయిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఎస్టిమేషన్‌ నుంచి బిల్లు ఫైనల్‌ అయ్యేలోపు వారికి కావాల్సిన కమీషన్‌ మాత్రం ఇచ్చి తీరాల్సిందే. పని నాణ్యతగా ఉన్నా లేకపోయినా వారికి సంబంధం లేదు. తమ పరిధి ఎన్ని రూ.లక్షల పని జరిగిందో ఆ మేరకు కమీషన్‌ ముక్కు పిండి మరీ వసూ లు చేస్తారు. పైసలెక్కువ ఇచ్చిన కాంట్రాక్టర్లకు అలాంటి ఇంజనీర్ల వత్తాసు ఇంకా ఎక్కువగా ఉంటుందట. తాగు నీటి సరఫరా విభాగంలో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా జరుగుతుంటాయని  కాంట్రాక్టర్ల వర్గాలే చెబుతున్నాయి. వస్తువులు కొనుగోలు చేసిన సందర్భాల్లోనూ కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువ ధర వేసి బిల్లు చేసిన దాఖలాలున్నాయి. ఇలాంటి వ్యవహారాల్లో కాంట్రాక్టర్లు బాగానే సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. 


కొలతలు కూడా తెలియవట...!

గతంలో సీసీ రోడ్లు, కాలువ నిర్మాణాలకు ఇసుక, సిమెంట్‌, కంకర మిక్స్‌ చేయడానికి మిల్లర్లు వాడేవారు. ఇప్పుడు ఐజాక్‌ మిషన్లు వచ్చాయి. వాటిలో 2క్యూబిక్‌ మీటర్ల నుంచి ఆరు...ఆ పైగా క్యూబిక్‌మీటర్ల మిషన్లున్నా యి. ప్రస్తుతం కార్పొరేషన్‌ పరిధిలో రెండు క్యూబిక్‌మీటర్ల ఐజాక్‌ మిషన్లు వాడుతున్నారు. అయితే అందులో ఎంత కొలతతో(నిష్పత్తి) వాటిని మిశ్రమం చేయాలనే విషయం చాలామంది ఏఈ, డీఈలకు కూడా తెలియదట. ప్రతి సారి వాటిని కొత్తగా వేసినట్లు మిక్స్‌ చేస్తుండటంతో పను లు ఆలస్యం అవుతున్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.  సీసీ డ్రెయిన్‌ల నిర్మాణాలు చాలా చోట్ల రోడ్డుకు ఎత్తులో ఉండటమే ఇందుకు నిదర్శనం. కొత్తగా నిర్మిస్తున్న ఎన్టీఆర్‌ మార్గ్‌ రోడ్డులో నూతనంగా నిర్మించిన కాలువకు, పక్కనే కాలనీల్లోని ఇళ్లముందు ఉన్న మురికి కాలువలకు చాలా తేడా ఉంది. ఆ మురికినీరు కొత్తగా నిర్మించిన కాలువలోకి ఎలా చేరుతాయోమరి. నగర శివారులో భవానీనగర్‌ మీదుగా బుక్కరాయసముద్రం వరకు ఫోర్‌లేన్‌ రోడ్డు నిర్మిస్తున్నారు. ఏళ్లతరబడి భవానీనగర్‌కు పారిశుధ్యం సమస్య ఉంది. కాలువ కూడా లేదు. అక్కడ సీసీ డ్రైన్‌ నిర్మించలేదు. ఈ విషయంపై ఆర్‌అండ్‌బీ అధికారులు తమకు సంబంధం లేదని చెబితే...కార్పొరేషన్‌ ఈఈ మా త్రం అది ఆర్‌అండ్‌బీ వాళ్లే చూడాలని చెబుతారు. ఆర్టీఓ కార్యాలయం రోడ్డులో నడిరోడ్డుకు అడ్డదిడ్డంగా రెండేళ్లక్రిత మే వీధిలైట్లు ఏర్పాటు చేశారు. వాటిని నేటికీ మార్చిన పాపానపోలేదు. ఇక నగరంలో ప్యాచ్‌వర్క్‌లకు టెండర్లు పిలిచారు. కానీ అన్నీ గుంతలే దర్శనమిస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఆ పని ఎందుకు చేయలేదో కూడా అడగలేని దుస్థితి. 


కాంట్రాక్టు ఉద్యోగే దిక్కు

ఇంజనీరింగ్‌ విభాగంలో కొందరు అధికారులు వ్యవహ రిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. పనుల అంచనా లోనూ ఆర్‌అండ్‌బీ, పబ్లిక్‌హెల్త్‌ ఇంజనీర్ల సాయం తీసు కుంటారట. అది కూడా సరిగా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఆ విభాగంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి పైనే ఇంజనీర్లు సైతం ఆధారపడతారంటే ఆశ్యర్యపోవాల్సి న అవసరం లేదు. ప్రతి ఫైల్‌కు సంబంధించి సాఫ్ట్‌వేర్‌, ఆన్‌లైన్‌ వ్యవహారాలన్నీ ఆయన చూడాల్సిందే. నోట్‌ఫైల్‌ తయారు చేయడం, డ్రాఫ్టింగ్‌ వర్క్‌ అన్నీ కూడా ఆ ఉద్యోగితోనే చేయిస్తుంటారు. ఎలాంటి ఫైల్‌కు ఎలా డ్రాఫ్టింగ్‌ చేయాలనేది కూడా కొందరు ఇంజనీర్లకు అవగాహన లేకుండాపోయిందనే విమర్శలున్నాయి. 



Updated Date - 2021-02-08T06:29:55+05:30 IST