ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య!

ABN , First Publish Date - 2021-10-07T06:43:55+05:30 IST

నగరంలోని రామ్‌ నగర్‌ గేట్‌ సమీపంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి ఉమేష్‌ (22) రైలు కిందపడి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య!
ఉమేష్‌ (ఫైల్‌ ఫొటో)

అనంతపురం రైల్వే, అక్టోబరు 6: నగరంలోని రామ్‌ నగర్‌ గేట్‌ సమీపంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి ఉమేష్‌ (22) రైలు కిందపడి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో రైల్వే ఎస్‌ఐ విజయ్‌కుమార్‌  సిబ్బందితో ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. సోమందే పల్లికి చెందిన నరసింహులు, లక్ష్మీదేవి కుమారుడు ఉమే ష్‌  జిల్లా కేంద్రంలో ఓ అద్దె గదిలో ఉంటూ విద్యానభ్యసి స్తున్నట్లు  రైల్వే పోలీసులు తెలిపారు.  కొద్దిరోజులుగా ఉ మేష్‌ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. బుధవారం తెల్ల వారుజామున గది నుండి బయ టకు వచ్చి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలి పా రు. అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్‌ఐ తెలిపారు. ఆనలైన ఆర్థిక లావాదేవీలు చేసి మోసపోయినట్లు అను మానాలు ఉన్నాయ న్నారు. కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్టు తెలిపారు.

మృతిపై పలు అనుమానాలు

ఉమేష్‌ ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నా యని అతడి తల్లిదండ్రులు, బంధువులు పేర్కొంటున్నా రు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాద ని, మృతదేహంపైన కూడా ఎక్కడా రైలు కింద పడి నట్లు ఆనవాళ్లు లేవన్నారు. తల ఎక్కడో ఉంది. మిగిలిన మృత దేహం మరో చోట పడి ఉందన్నారు. దీనికి తోడు మృతు డి వివరాలు తెలిసిన తరువాత తమకు తెలియ జేయ కుండా  మృతదేహాన్ని మార్చురీకి తరలించటం వంటి పరిస్థితులు గమనిస్తే అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయని వారు తెలిపారు. 


Updated Date - 2021-10-07T06:43:55+05:30 IST