ఈనామ్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే
ABN , First Publish Date - 2021-10-29T05:40:47+05:30 IST
రైతు పంట ఉత్పత్తుల కొనుగోళ్లు తప్పని సరిగా ఈనామ్ ద్వారానే జరగాలని మార్కెట్ యార్డు కమిటీ చైర్మన కొండూరు మల్లికార్జున సూచించారు.

బకాయిలు వెంటనే చెల్లించాలి: మార్కెట్ యార్డు కమిటీ చైర్మన
హిందూపురం, అక్టోబరు 28: రైతు పంట ఉత్పత్తుల కొనుగోళ్లు తప్పని సరిగా ఈనామ్ ద్వారానే జరగాలని మార్కెట్ యార్డు కమిటీ చైర్మన కొండూరు మల్లికార్జున సూచించారు. గురువారం మార్కెట్ యార్డులో ట్రేడర్స్, కమీషన ఏజెంట్లతో ఈనామ్ అమలు, మార్కెట్ బకాయిలపై సమీక్ష సమావేశం చైర్మన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ మార్కెట్ యార్డుకు రైతులు తీసుకువచ్చే పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో గిట్టుబాటు ధర, పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఈనామ్ తీసుకువచ్చిందన్నారు. ఈవిధానాన్ని అమలు చేయాలని మార్కెటింగ్‌శాఖ నుంచి స్పష్టమైన ఆధేశాలున్నాయన్నారు. ట్రేడర్స్ అందరూ ఈనామ్ ద్వారానే కొనుగోళ్లు చేయాలని సూచించారు. ఈవిధానం అమలకు అవసరమైన సదుపాయాలను మార్కెట్ యార్డు నుంచి కల్పిస్తామన్నారు. అదేవిధంగా మార్కెట్‌కు చెల్లించాల్సిన పన్ను, దుకాణాల అద్దె, విద్యుత బకాయి బిల్లులు సకాలంలో చెల్లించాలన్నారు. ఈవిషయంపై ట్రేడర్స్, కమీషన ఏజెంట్లు స్పందిస్తూ ఈనామ్ విధానంలో కొనుగోళ్లకు తమకు ఇబ్బందిలేదని అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. పంట కొనుగోళ్లలో రైతులకు చెక్కులు ఇస్తామని తీసుకునేందుకు రైతులను మార్కెట్ యార్డు కమిటీ ఒప్పించాలన్నారు. అనంతరం యార్డులో చేపట్టాల్సిన సౌకర్యాలు, అభివృద్ధి అంశాలపై చర్చంచారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన పురుషోత్తమరెడ్డి, కార్యదర్శి నారాయణమూర్తి, ట్రేడర్స్, కమీషన ఏజెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.