ఉపాధి కూలీల బిల్లులను వెంటనే చెల్లించాలి

ABN , First Publish Date - 2021-05-30T05:32:28+05:30 IST

కొంత కాలంగా బకాయిలు పడ్డ ఉపాధి కూలీల బిల్లులను వెంటనే చెల్లించాలని మండల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శనివారం డిమాండ్‌ చేశారు.

ఉపాధి కూలీల బిల్లులను వెంటనే చెల్లించాలి
కూలీలతో మాట్లాడుతున్న కార్మిక సంఘం నాయకులు

చిలమత్తూరు, మే 29: కొంత కాలంగా బకాయిలు పడ్డ ఉపాధి కూలీల బిల్లులను వెంటనే చెల్లించాలని మండల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శనివారం డిమాండ్‌ చేశారు. వారు టేకులోడు పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు.  ఉపాధి కూలీలకు చేసిన పనులకు బిల్లులు అందకపోవడంతో వారు కుటుంబాలను పోషించకుకోవడం కష్టంగా మారిందన్నారు. వెంటనే వారికి అందాల్సిన బిల్లులను త్వరితగతిన అందజేయాలన్నారు. అదేవిధంగా వారు పనిచేసే చోట్ల ఏ మాత్రం మౌలిక వసతులు కల్పించలేదన్నారు. కూలీలకు నీడనిచ్చే టెంట్లు, మజ్జిగ, తాగునీరు, మెడికల్‌ కిట్లు, కరోనా సమయంలో మాస్క్‌లు అసలే లేవన్నారు. రోజు వారి కూలీలు రూ. 500 వరకు ఉంటున్నాయని, ఈ ఉపాధి పనులకు వెళ్లే వారికి రూ. 150లు కూడా పడటం లేదన్నారు. పని దినాలు పెంచి కూలీలకు మరిన్ని రోజులు ఉపాధిని కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్‌కుమార్‌, వినోద్‌, లక్ష్మినారాయణ తదితరులు ఉన్నారు. 
Updated Date - 2021-05-30T05:32:28+05:30 IST