ఉప్పెనలా ‘ఉపాధి’ కూలీలు

ABN , First Publish Date - 2021-05-08T06:29:01+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కు మండలంలో తాకిడి పెరిగింది. కరోనా కర్ఫ్యూ కారణంగా వలస కూలీ లు, కళాశాలల బంద్‌తో విద్యార్థులు గ్రామాలకు చేరుకున్నారు.

ఉప్పెనలా ‘ఉపాధి’ కూలీలు
ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు

కరోనా కర్ఫ్యూతో పనులకు వలస కూలీలు, విద్యార్థుల తాకిడి

గుమ్మఘట్ట మండలంలో రోజూ 6500 మంది కూలీల హాజరు

పని ప్రాంతంలో పొంచి ఉన్న కరోనా ముప్పు


గుమ్మఘట్ట, మే 7 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కు మండలంలో తాకిడి పెరిగింది. కరోనా కర్ఫ్యూ కారణంగా వలస కూలీ లు, కళాశాలల బంద్‌తో విద్యార్థులు గ్రామాలకు చేరుకున్నారు. పల్లెల్లో వ్య వసాయ పనులు లేక... వీరంతా ఉపాధి కూలీ పనులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో కూలీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం కల్పించే ఉ పాధి పనులకు వివిధ గ్రామాల నుంచి కూలీలు ఉప్పెనలా తరలివెళుతున్నారు. ఉపాధి పనుల లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులపై ఒత్తిడి పె రుగుతున్న నేపథ్యంలో కరోనా కర్ఫ్యూ వారికి ఊరటనిస్తోంది. కూలీలు అ డిగిన వారందరికీ పనులు కల్పించే పనిలో బిజీగా నిమగ్నమవుతున్నారు.  గతంలో ఉపాధి కోసం వలస వెళ్లిన నిరుద్యోగ యువత, విద్యార్థులు సైతం కర్ఫ్యూ కారణంగా పల్లెలకు చేరుకుని ఉపాధి కోసం పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుం చి ఎనిమిది వేల మంది కూలీలు గ్రూపుసభ్యులుగా వుండగా, ప్రతి రోజూ 6500 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నట్లు ఉపాధి హామీ అధికార బృందం వెల్లడిస్తోంది. వీటిలో అత్యధికంగా కలుగోడు గ్రామ పం చాయతీ నుంచి రోజుకు 1400 మంది కూలీలు పనులకు వెళుతున్నారు. గలగల గ్రామంలో 800 మంది, గుమ్మఘట్ట 300, భూపసముద్రం 400, తాళ్లకెర 400 మందితో పాటు వివిధ గ్రామాల్లో 200 మందికి తగ్గకుండా ప్రతినిత్యం ఉపాధి పనుల్లో నిమగ్నమవుతున్నారు. 


కరోనా జాగ్రత్తలేవి?

గ్రామాల్లో గుంపులు, గుంపులుగా ఉపాధి కూలీలు పనులకు వెళుతు న్నారు. పని ప్రాంతంలోనూ ఎటువంటి కరోనా జాగ్రత్తలు పాటించడం లే దు. అధికారులూ విస్మరిస్తుండడంతో కూలీల్లో కరోనా ఆందోళన నెలకుం టోంది. కూలీలకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లు తదితరాలు సమకూర్చకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లో కొంతకాలంగా తాత్కాలిక ఉద్యోగులుగా ప్రైవేటు కంపెనీల్లో విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న నిరుద్యోగ యువత, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూ డా పనులకు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తున్న ఉపాధి హామీ ప నుల్లో చురుకుగా పాల్గొంటూ జీవనభృతి కోసం పాకులాడుతున్నారు.


కూలీ సొమ్ము చెల్లింపులో జాప్యం

ప్రభుత్వం కూలీలకు సకాలంలో చెల్లించాల్సిన కష్టార్జితం సొమ్మును సై తం 20 రోజులు గడిచినా ఇవ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని అధికారులు కూలీలపై ఒత్తిడి పెంచుతున్నారే తప్పా... కూలీలకు చేసిన పనులకు సొమ్ము చెల్లించ డంలో జాప్యం చేస్తున్నారు. వేసవి ఎండలను దృష్టిలో వుంచుకుని ప్రభు త్వం ప్రత్యేకంగా కూలీలకు అదనపు కరువుభత్యంతో పాటు కూలీరేట్లను పెంచింది. క్యూబిక్‌ మీటర్‌కు రూ.218 నుంచి రూ.220 చెల్లిస్తుండటంతో కూ లీ గిట్టుబాటు కావడం లేదని, అదనంగా రేటు పెంచి కూలీలు అడిగిన పనిదినాలను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. మండుతున్న ఎండల్లో కూలీలకు పని ప్రాంతాల్లో సరియైున నీడ సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరూ అందని పరిస్థితి నెలకుంది. 


ఉపాధి హామీ పనులతో ఊరట

కార్తిక్‌, డిగ్రీ విద్యార్థి 

కరోనా వేళ కళాశాలలకు సెలవులు ప్రకటించారు. దీంతో ఇంటి వద్ద  తల్లిదండ్రులకు చేదోడుగా ఆర్థిక సాయం చేకూర్చేందుకు నిత్యం ఉపాధి పనులకు వెళుతున్నా. ప్రభుత్వం సకాలంలో కూలీ సొమ్ము చెల్లించి ఆదుకోవాలి. 


కూలీ రేటు పెంచి ఆదుకోవాలి

ఈశ్వర, కూలీ

గత మూడేళ్లుగా బెంగళూరులో దినసరి భవన నిర్మాణ కార్మికుడిగా ఉపాధి పొందేవాన్ని. రెండేళ్లుగా కరోనా దృష్ట్యా ఉపాధి కొరవడటంతో ఊళ్లోనే ఉంటున్నా. నాలుగు గంటలు శ్రమిస్తే రోజుకు రూ.200 ఉపాధి సొమ్ము వస్తుంది. మరింత కూలీరేటు పెంచితే సొంత గ్రామంలోనే కుటుంబానికి చేదోడుగా వుంటాను. 


సకాలంలో కూలి సొమ్ము చెల్లిస్తాం

 సురేష్‌, ఏపీవో, ఉపాధిహామీ 

ఉపాధి పనులు చేసిన కూలీలందరికీ సకాలంలో కూలీ సొమ్ము చెల్లించేందుకు బిల్లులు సిద్ధం చేసి వుంచాం. రెండు రోజుల్లో కూలీల ఖాతాలకు   సొమ్ము జమవుతుంది. వేసవిలో 30 శాతం కూలీ రేట్లు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు అందాయి. రోజు కూలీ రూ.250 నుంచి రూ.300 దాకా చెల్లిస్తున్నాం. వేసవిలో తాగునీరు, పనిముట్ల సౌకర్యాల కోసం కూలీలకు అదనంగా నీటి కోసం రూ.5లు, గడ్డపారలకు రూ.పది చొప్పున వారి వ్యక్తిగత ఖాతాలకు జమ చేస్తాం. 

Updated Date - 2021-05-08T06:29:01+05:30 IST