యంత్రాలకు ’ఉపాధి’
ABN , First Publish Date - 2021-05-20T06:09:16+05:30 IST
ఏకంగా పట్ట పగలే ఎక్స్‌కవేటర్లతో పంటకుంటలు తవ్విస్తు న్నారు.

ఉపాధి పథకం పనుల్లో అక్రమాలు
ఎక్స్‌కవేటర్లతో పంటకుంటల తవ్వకాలు
బినామీ మస్టర్లతో నిధుల స్వాహా
గ్రామస్థుల ఫిర్యాదుతో అవినీతి వెలికి
బుక్కరాయసముద్రం, మే19: కరోనా సమయంలో ఉపాధి హామీ పథకం పనుల్లో అ క్రమాలు వెలుగుచూస్తున్నాయి. గ్రామీణ ప్రాం తాల నుంచి వలసలను నివారించేందుకు అమ లు చేసిన ఈ పథకం మండలంలో అబాసు పాలవుతోంది. ‘అధికారంలో ఉన్నాం... ఏమి చేసి నా మేము చూసుకుంటాం? మీరు ఎక్స్‌కవే టర్ తో పంటకుంటలు తవ్వించు... అలాగే అన్నిం టికి మేము అండగా ఉంటాం’ అంటూ అధికార పార్టీ నేతలు ఫీల్డ్ అసిస్టెంట్లుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంకేముంది... తమ వెనుక నేతల దీవెన పూర్తిగా ఉండ డంతో మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లూ రెచ్చిపోతున్నారు. ఏకంగా పట్ట పగలే ఎక్స్‌కవేటర్లతో పంటకుంటలు తవ్విస్తు న్నారు. అనంతరం చేసిన పని వద్దకు కొంత మంది కూలీలును పెట్టి తుది మెరుగులు దిద్దు తున్నారు. అంతేగాకుండా బినామీ మస్టర్లు వే సుకుని లక్షలాది రూపాయలు సొమ్ము చేసు కుంటున్నారు. ఇందుకు మండల పరిధిలోని కేకే ఆగ్రహారం పంచాయతీ సంజీపురం జరిగిన పంటకుంటల తవ్వకాలే ఉదాహరణ. ఆ గ్రామంలోనే కాదు... మండలంలోని పలు గ్రామాల్లో ఇదే వ్యవహారం భారీగా సాగుతోందని పలువురు కూలీలు ఆరోపిస్తున్నారు.
పగలే యంత్రాలతో పనులు
గ్రామాల్లో పట్ట పగలే ఎక్స్‌కవేటర్లతో యథేచ్ఛగా ఉపాధి హామీ పథకం కింద పంటకుంటలు, ట్రెంచలు తీస్తున్నారు. ఇందులో పనులను పర్యవేక్షించాల్సిన ఉపాధి సిబ్బంది హస్తమూ ఉండడంతో ఆ పథకం భారీ అవినీతికి అడ్డాగా మారింది. సంజీపురంలో ఏకంగా రూ. 2లక్షల పనులను యంత్రాలతో చేసి వాటికి మెరుగులును దిద్దేందుకు వ్యూహం రచించారు. వీటిని అధికార పార్టీ నేతల అండతో ఉపాధి సిబ్బంది చేయించినట్లు తెలుస్తోంది. పలు గ్రామ పం చాయతీల్లో ఇదే తంతు నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామ పంచాయతీల్లో అయితే గతంలో చేసిన పనులునే తిరిగి మళ్లీ చేస్తున్న ట్లు సమాచారం. ఇందులో కూలీలకు కొంత, సిబ్బందికి, అధికార పార్టీ నేతల కు ఇంత అని లెక్కలు వేసుకుని వేల రూపాయాలు స్వాహా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చెప్పింది వినాలి...
కరోనా విపత్కర పరిస్థితుల వల్ల చాలామంది రోజు వారీ పని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇది ఆసరా చేసుకుని పలు గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కూ లీలపై పెత్తనం చెలాయిస్తున్నట్లు సమాచారం. మే ము ఏమి చెబితే అది వినాలి... లేదంటే జాబ్‌కార్డు తొ లగిస్తాం, పనులు కల్పించం, చేసిన పనికి తక్క వ కూలీ వేస్తాం.. అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు కూలీలు వాపోతున్నారు. యంత్రాలతో పనులు చేసి న అనంతరం కూలీలను అక్కడికి తీసుకెళ్లి ఫొటోలు తీసి బిల్లులు చేసుకుంటున్నట్లు సమాచారం. వీటితో పాటు ప్రతి కూలీ గ్రూపు నుంచి వారానికి రూ.100 ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలి సింది. కొంద ఫీల్డ్ అసిస్టెంట్లు చేసిన అవినీతిలో ఉపాధి హమీ సిబ్బందికీ కొంత అందుతున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ఫీల్డ్ అసిస్టెంట్ల బెదరింపులతో ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటకు చెబితే బెదరింపులకు దిగుతు న్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నాతాధికారులు ఫీల్డ్ అసిస్టెంట్ల అవినీతిని అరికట్టి, చేసిన పనికి పూర్తిగా నగదు ఇప్పించాలని కూలీలు కోరుతున్నారు.
సంజీపురంలో యంత్రాలతో పనులపై జేసీకి ఫిర్యాదు
కూలీలకు ఉపాధి కల్పించకుండా సంజీపురం గ్రామంలో ఏకంగా కొందరు అధికార పార్టీ నేతలు ఉపాధి హమీ పథకం కింద పంటకుంటల తవ్వకం పనులను ఎక్స్‌క్‌వేటర్‌తో చేపట్టారు. ఈ విషయంపై కొంత మంది కూలీలు జాయింట్ కలెక్టర్ గంగాధర్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు వి చారణ చేపట్టగా అధికారుల అవినీతి బాగోతం బట్టబయలు అయింది. బుధవారం ఏపీడీ నీలిమ, ఎంపీడీఓ తేజోత్స్న గ్రామంలో యంత్రాలతో చేప ట్టిన పనులను పరిశీలించారు. విచారణ చేసి నివేదికను సమర్పించాలని జేసీ సూచించారని ఏపీడీ తెలిపారు. పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉపాధి పనులు ఇలా చేస్తే ఎవరిపైన అయినా కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీడీ హెచ్చరించారు.