బెట్టింగ్‌ జోరు

ABN , First Publish Date - 2021-05-02T06:26:39+05:30 IST

కరోనా విలయ తాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు బిక్కుబి క్కుమంటూ కాలం వెల్లబుచ్చుతున్నారు. ఉపాధికి దూర మవుతున్న నేపథ్యంలో పూటగడవడమెట్లా అన్న ఆలోచన లో ప్రజలున్నారు. రాజకీయ పార్టీల నేతలు, బెట్టింగ్‌ రా యుళ్ల ఆలోచనలు మాత్రం తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల ఫలితాల చుట్టే తిరుగుతున్నాయి.

బెట్టింగ్‌ జోరు

 తిరుపతి ఉప ఎన్నిక

మెజార్టీపై రూ.కోట్లలో పందెం  

 వైసీపీకి 5 లక్షలు మెజార్టీ రాదంటున్న విపక్షాలు  

నేడు ఓట్ల లెక్కింపు

అనంతపురం,మే 1(ఆంధ్రజ్యోతి): కరోనా విలయ తాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు బిక్కుబి క్కుమంటూ కాలం వెల్లబుచ్చుతున్నారు. ఉపాధికి దూర మవుతున్న నేపథ్యంలో పూటగడవడమెట్లా అన్న ఆలోచన లో ప్రజలున్నారు.  రాజకీయ పార్టీల నేతలు, బెట్టింగ్‌ రా యుళ్ల ఆలోచనలు మాత్రం తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల ఫలితాల చుట్టే తిరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలైనా... ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచులైనా కాయ్‌ రాజా... కాయ్‌ అంటూ బెట్టింగ్‌ రాయుళ్లు రంగంలోకి దిగుతున్నారు.  ఆదివారం తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో... బెట్టింగ్‌ రాయుళ్లు పందెం కాయడంపైనే ప్ర ధానం గా దృష్టి సారించారు. ఈ ఉప ఎన్నిక ఫలితంపై బెట్టింగ్‌కాయడానికి ప్రధాన కారణాలు లేకపోలేదు. అధికా ర వైసీపీ తమ అభ్యర్థి 5 లక్షలకుపైగా మెజార్టీతో గెలు పొం దుతారని ఆదినుంచి ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్న విషయం తెలిసిందే. ఆ విషయం అలా ఉంచితే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికను అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీలతో పాటు బీజేపీ, జనసేన కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే...  ఆయా రాజకీయ పార్టీల ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచా రం చేశారు. అధికార వైసీపీ నుంచి ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి మినహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తిరుపతిలోనే తిష్టవేసి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడుతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కా ర్యదర్శి, నారాలోకేష్‌, ఆపార్టీ  రాష్ట్ర ముఖ్య నేతలు, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి విజయం కోసం ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ విజయాన్ని కాం క్షిస్తూ బీజేపీ అగ్రనేతలతో పా టు... జనసేన అధినేత పవనకళ్యాణ్‌ ప్రచారం నిర్వహిం చడంతో తిరుపతి ఉప ఎన్నిక అత్యంత రాజకీయ ప్రాధా న్యతకు తెరతీసింది. దీనికి తోడు జిల్లాకు చెందిన ఆయా రాజకీయ పార్టీల నేతలు వారి వారి పార్టీల అభ్యర్థుల విజయం కోసం తిరుపతిలో తిష్టవేసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికల ఫలితంపై బెట్టింగ్‌కు దిగుతున్నారు. ఉప ఎన్నికల పోలింగ్‌ ఏ విధం గా జరిగిందో, అధికార వైసీపీ ఏ విధంగా దొంగ ఓట్లు వేయించిందో కళ్లకు కట్టినట్లుగా వివిధ మీడియా చానళ్లలో ప్రసారమైన ఆ దృశ్యాలను రాష్ట్ర ప్రజానీకమం తా వీక్షించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగిన తీరును అధికార వైసీపీ నా యకులు అంచనా వేస్తూ జోరుగా బెట్టింగ్‌ కాస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి గురుమూర్తి 5 లక్షలకుపైగా మెజార్టీతో గెలుపొందుతారని ఎవరికి వారు లక్షల్లో బెట్టింగ్‌ కాస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష టీడీపీతో పాటు బెట్టింగ్‌ రాయుళ్లు అంత మెజార్టీ రాదని పందెం కాస్తున్నారు. కేవలం మెజార్టీపైనే జోరుగా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు, వ్యాపార వర్గాలు, బెట్టింగ్‌రాయుళ్ల మధ్య పం దెం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవ ర్గాల్లోనూ తిరుపతి ఉప ఎన్నిక ఫలితంపైనే బెట్టింగ్‌ కా స్తుండటం చర్చనీయాంశంగా మారింది. వివిధ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు... జిల్లా కేంద్రంలోనే ఓ నాయకుడు రూ. 25 లక్షలదాకా వైసీపీ అభ్యర్థి మెజా ర్టీపై పందెం కాసినట్లు తెలుస్తోంది. ఇలా ఎవరి స్థాయిలో వారు రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షల దాకా పందెం కాస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా రూ.  దాదాపు రూ. 10 కోట్ల వరకూ బెట్టింగ్‌ జరుగుతోందన్న అంచనా. మరి ఆదివారం ఉదయం 12 గంటలకల్లా మెజార్టీ అంచనాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో... బెట్టింగ్‌రాయుళ్లల్లో ఎవరు చేతులు కాల్చుకుంటారో... ఎవరు లాభపొందుతారో సాయంత్రంలోపు తేలిపోనుంది. Updated Date - 2021-05-02T06:26:39+05:30 IST