రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-11-02T06:16:25+05:30 IST

మండలంలోని అరవకూరు గ్రామాని కి చెందిన వృద్ధుడు మలోబులు (58) సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
మలోబులు(ఫైల్‌)

కూడేరు, నవంబరు 1: మండలంలోని అరవకూరు గ్రామాని కి చెందిన వృద్ధుడు మలోబులు (58) సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్‌ఐ యువరాజు, స్థానికులు తెలిపిన వివరాలివి. మలోబులు సాయంత్రం అనంతపురం నుంచి ద్విచక్ర వాహనంలో అరవకూరు గ్రామానికి బయలుదేరాడు. ప్రధాన ర హదారి దాటుతుండగా... వెనుకవైపు నుంచి మరో ద్విచక్ర వాహ నం ఢీకొంది. గాయపడిన మలోబులును స్థానికులు 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మలోబులు తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేశారు. మృతి చెందిన వి షయం తెలుసుకున్న ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్‌, అనంతపు రం పార్లమెంటు ప్రధాన కార్యదర్శి శ్రీదర్‌చౌదరి సంతాపం తెలియజేశారు. బాధిత కుటుబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 


Updated Date - 2021-11-02T06:16:25+05:30 IST