రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-08-10T06:12:27+05:30 IST

పట్టణంలోని బళ్లా రి రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భ వన నిర్మాణ కార్మికుడు వెంకట శివారెడ్డి (58) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
వెంకటశివారెడ్డి (ఫైల్‌)

రాయదుర్గం టౌన, ఆగస్టు 9 : పట్టణంలోని బళ్లా రి రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భ వన నిర్మాణ కార్మికుడు వెంకట శివారెడ్డి (58) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. కర్ణాటక ప్రాంతమైన చెళ్లకెర తాలుకా బాళేహళ్లి గ్రామానికి చెం దిన వెంకటశివారెడ్డి రెండు నెలల క్రితం రాయదుర్గం పట్టణానికి వలస వచ్చాడు. డ్రైవర్స్‌ కాలనీలో నివాసం వుంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో పని ముగించుకుని బళ్లారి రోడ్డులో వ స్తుండగా వెనుకవైపు నుంచి వచ్చిన కంకర లోడు ట్రాక్టర్‌ వెంకటశివారెడ్డి పై దూసుకెళ్లింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.  కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యా రు. ప్రమాదంతో ఈమార్గంలో ట్రాఫిక్‌ స్తంభించింది. ట్రాఫిక్‌ ఎస్‌ఐ కుళ్లాయస్వామి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య పంకజ, ఇద్దరు కుమారులు, కుమార్తె వున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు అర్బన సీఐ ఈరణ్ణ తెలిపారు. 

Updated Date - 2021-08-10T06:12:27+05:30 IST