బియ్యం కార్డుకు ఈ-కేవైసీ కష్టాలు

ABN , First Publish Date - 2021-08-25T06:32:32+05:30 IST

బియ్యం కార్డు లబ్ధిదారులను ఈ-కేవైసీ కష్టాలు వెంటాడుతున్నాయి. సెప్టెంబరు నెలాఖరులోపు ఆధార్‌ను అప్‌డేట్‌ పూర్తి చే యాలని అధికారులు వెల్లడించడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నా రు.

బియ్యం కార్డుకు ఈ-కేవైసీ కష్టాలు
పిల్లాపాపలతో తహసీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించిన దృశ్యం

సర్వర్‌ పని చేయక ఆధార్‌ కేంద్రాల వద్ద పడిగాపులు


ఉరవకొండ, ఆగస్టు 24: బియ్యం కార్డు లబ్ధిదారులను ఈ-కేవైసీ కష్టాలు  వెంటాడుతున్నాయి. సెప్టెంబరు నెలాఖరులోపు ఆధార్‌ను అప్‌డేట్‌ పూర్తి చే యాలని అధికారులు వెల్లడించడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నా రు. ఆధార్‌సెంటర్లు, వలంటీర్ల వద్దకు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ఐ దేళ్లు నిండిన పిల్లలను వేలిముద్రల కోసం తల్లిదండ్రులు ఆధార్‌ సెంటర్ల వ ద్దకు తీసుకువస్తున్నారు. చాలామంది పనులు మానుకుని ఆధార్‌ కేంద్రాల వద్ద గంటలతరబడి పడిగాపులు కాస్తున్నారు. రేషన ఆగిపోతే తినడానికి క ష్టమవుతుందని ఒకటి, రెండు రోజులు పనులు మానుకుని ఆధార్‌ కేంద్రాలకు వస్తున్నారు. మంగళవారం ఉదయం నింబగల్లు, నెరమెట్ల గ్రామాలకు చెందిన  ప్రజలు తెల్లవారుజామునే ఆధార్‌ కేంద్రానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ సర్వర్‌ పనిచేయడం లేదని చెప్పడంతో గంటల తరబడి నిరీక్షించి నిరాశగా వెనుదిరిగి పోయారు. అధికారులు తప్పనిసరిగా ఆధార్‌ ను అప్‌డేట్‌ చేసుకోవాలని గ్రామ వలంటీర్‌ ద్వారా సచివాలయ సిబ్బంది నోటీ్‌సలు ఇచ్చారని, వ్యయప్రయాసలు ఓర్చి ఆధార కేంద్రాలకు వస్తే సర్వర్‌ పనిచేయడం లేదని చెప్పడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఆ యా గ్రామాలకు చెందిన ప్రజలు తహసీల్దారు కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. 


ఐదు గంటలకే వచ్చాం: హరికృష్ణ, నింబగల్లు

ఆధార్‌ అప్‌డేట్స్‌ కోసమని పనులు మానుకుని ఇద్ద రు పిల్లలతో కలిసి ఉదయం ఐదు గంటలకే వచ్చాను. ఆధార్‌ కేంద్రంలో సర్వర్‌ పని చేయడం లేదని చెప్పారు. అసలు ఈ రోజు అప్‌డేట్‌ అవుతుందో, లేదో తెలియదు. స్థానికంగానే అప్‌డేట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలి. 


కరోనా భయం ఉన్నా తప్పడం లేదు: ప్రతా్‌పరెడ్డి, నెరమెట్ల

ఉదయం ఆరు గంటలకే మా పిల్లలను తీసుకుని ఆ ధార్‌ కేంద్రాలకు వచ్చాం. పశు వైద్యశాల ఆధార్‌ కేం ద్రంలో సర్వర్లు పనిచేయడం లేదని చెప్పారు. ఈకేవైసీ చేయించకపోతే రేషన బియ్యం ఇవ్వరని పిల్లలను తీసుకుని వచ్చాం. ఒకవైపు కరోనా భయం ఉన్నా తప్పడంలేదు.

Updated Date - 2021-08-25T06:32:32+05:30 IST