పార్టీ బలోపేతానికి కృషి : టీడీపీ నాయకులు

ABN , First Publish Date - 2021-07-24T06:25:38+05:30 IST

మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కలిసి కట్టుగా పనిచేస్తామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి : టీడీపీ నాయకులు
సిద్దరాంపురంలో గ్రామస్థాయి కమిటీ ఎంపిక అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు

ఆత్మకూరు, జూలై23 : మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కలిసి కట్టుగా పనిచేస్తామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మండల పరిధిలోని బీ యాలేరు, సిద్ధరాంపురం గ్రామాల్లో శుక్రవారం టీడీపీ గ్రామస్థాయి కమిటీల ఎంపిక  ని ర్వహించారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కలిసికట్టు గా పనిచేసేందుకు పార్టీ నాయకులు, కార్యక ర్తలు కదలిరా వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి నారాయణస్వామి, టీడీపీ హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి శశాంక్‌ చౌదరి, తెలుగు మహిళ అధికార ప్రతినిధి లక్ష్మీదేవమ్మ, మండల కన్వీ నర్‌ సూరి, మండల నాయకులు వేణుగోపాల్‌, బండి పరశురాం, శ్రీనివాసులు, రాజార మేష్‌, వెంకటనారాయణ, రామదాసు, కురుబ నారాయణ, కృష్ణ, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-24T06:25:38+05:30 IST